మహిళలు ఏడ్చేందుకు ప్రత్యేక గదులు: సకల సౌకర్యాలు కల్పించిన హోటల్
టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలోని ఓ హోటల్ యాజమాన్యానికి వచ్చిన వింత ఆలోచనను అమల్లో పెట్టేసేంది. అదేంటంటే.. మహిళలు ప్రత్యేకంగా ‘క్రైయింగ్ రూమ్స్'(ఏడ్చే గదులు) ఏర్పాటు చేసింది. అంతేకాదు, ఆ గదిలో ఏడ్పుగొట్టు సినిమాలు ప్రదర్శితమవుతాయి. మహిళలు తమకిష్టమైన ఏడ్పుగొట్టు సినిమాలు ఎంచుకోవచ్చు కూడా. ఇక్కడ మహిళలు ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా ఏడ్చుకోవచ్చు.
మెట్రో.కో.యుకె కథనం ప్రకారం.. కన్నీళ్లను తుడ్చుకోవడానికి లగ్జరీ టిష్యూస్, ఐ మాస్కులు కూడా హోటల్ యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ సౌకర్యాలను కల్పించిన ‘ది మిత్సూయి గార్డెన్ హోటల్' యాజమాన్యం మాట్లాడుతూ.. ఒత్తిడి నుంచి బయటపడేందుకే మహిళల కోసం ప్రత్యేకంగా ఏడ్చే గదులను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

భావోద్వేగ సమస్యలను ఎదర్కొనేందుకు తమ మనస్ఫూర్తిగా ఈ గదుల్లో మహిళలు ఏడ్చేయోచ్చని తెలిపింది. ఒక రాత్రి ఈ గదిలో బస చేసేందుకు 83 డాలర్లను వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొంది. కన్నీళ్లు తుడ్చుకునేందుకు లగ్జరీ వస్తువులతోపాటు కావాలంటే సహాయకులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పింది హోటల్ యాజమాన్యం.
బాగా ఏడ్చేందుకు ఫారెస్ట్ గంప్, ఏ టేల్ ఆఫ్ మేరీ, త్రీ పప్పీస్(2004లో చియస్తులో సంభవించిన భూకంప సమయంలో ఓ కుక్క, తన పప్పీలను ఎలా రక్షించుకుందనే వాస్తవ కథతో 2007లో వచ్చిన చిత్రం) లాంటి చిత్రాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. కన్నీళ్లు పెట్టించే పుస్తకాలు కూడా ఇక్కడ లభిస్తాయని హోటల్ యాజమాన్యం తెలిపింది. మహిళా కస్టమర్లు ప్రశాంతంగా ఏడ్చేందుకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.












Click it and Unblock the Notifications