బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవం: కార్యకర్తలకు ప్రధాని మోడీ దిశానిర్దేశం; వంశపారంపర్య రాజకీయాలపై ఆగ్రహం
ప్రతి బిజెపి కార్యకర్త దేశ కలలకు ప్రతినిధి అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ, కచ్ నుంచి కోహిమా వరకు ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ మంత్రంతో బీజేపీ నడుస్తుందని మోడీ పేర్కొన్నారు.

42వ బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ ప్రాధాన్యత చెప్పిన పీఎం మోడీ
ఈ సంవత్సరం బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నదని పేర్కొన్న ఆయన దేశం 75 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్న సంవత్సరాలలో వ్యవస్థాపక దినోత్సవం జరగడం మొదటి కారణమని, మూడు దశాబ్దాల తర్వాత రాజ్యసభలో బీజేపీ సభ్యుల సంఖ్య 100 దాటడం రెండవ కారణమని, ఇటీవల జరిగిన ఎన్నికలలో నాలుగు రాష్ట్రాలలో డబల్ ఇంజన్ ప్రభుత్వాలు ఏర్పడడం మూడవ కారణమని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.

ప్రజలు బీజేపీ పాలనలో మార్పును ఆస్వాదిస్తున్నారు
బీజేపీ కార్యకర్తల పై మరింత బాధ్యత పెరిగిందని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోడీ, దేశం కోసం మనల్ని మనం వెచ్చించాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒకప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మార్పు రాదు అని ప్రజలు భావించేవారని, కానీ ప్రస్తుతం ప్రజలు మార్పును ఆస్వాదిస్తున్నారని ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ అనే సంకల్పాన్ని బీజేపీ నిరంతరం బలోపేతం చేస్తోందని మోడీ వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాల తర్వాత రాజ్యసభలో పార్టీ సభ్యుల సంఖ్య వందకు చేరుకుందని పేర్కొన్న ప్రధాని మోడీ, బిజెపి బాధ్యతను ప్రపంచ దృష్టి కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు.

బిజెపి ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోంది
నేడు భారత్ తన సమస్యలను, ఆందోళనలను అంతర్జాతీయ వేదికలపై ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా లేవనెత్తుతోందని మోడీ వెల్లడించారు. ప్రపంచం మొత్తం రెండు వ్యతిరేక ధృవాలుగా విడిపోయిన సమయంలో మానవత్వం గురించి దృఢంగా మాట్లాడగల దేశంగా భారతదేశం నిలిచిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందని పేర్కొన్న మోడీ ఈ అమృత కాలంలో భారతదేశ సొంత ఆలోచన, స్వయంశక్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

వంశ పారంపర్య రాజకీయాలపై మోడీ ఫైర్
సామాజిక న్యాయం, సామరస్యం తీర్మానాలతో బిజెపి ఆలోచన బీజం పడిందని, అందుకే ఈ అమృత కాలం ప్రతీ బిజెపి కార్యకర్తలకు పని సమయం అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీల పై విరుచుకుపడిన ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ప్రస్తుతం రెండు రకాల రాజకీయాలు ఉన్నాయని వెల్లడించారు. అందులో ఒకటి వంశపారంపర్య రాజకీయాలు అయితే రెండవది జాతీయత అని వ్యాఖ్యానించిన మోడీ, వంశపారంపర్య రాజకీయాలపై విరుచుకుపడ్డారు.

కుటుంబ పార్టీలు యువతకు ద్రోహం చేస్తున్నాయి
కుటుంబ పార్టీలు యువతకు ద్రోహం చేస్తున్నాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీలు దేశంలోని యువతను ఎప్పుడు అభివృద్ధి చెందనివ్వలేదని మోడీ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి కుటుంబ పార్టీలే అతి పెద్ద శత్రువు అని ఇప్పుడు దేశ యువత అర్థం చేసుకోవడం మొదలు పెట్టిందని పేర్కొన్న మోడీ మనదేశంలో దశాబ్దాలుగా కొన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

పేదల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించే పార్టీ బీజేపీ
కొందరికి మాత్రమే వాగ్దానాలను చేయడం, చాలా మందిని తృణప్రాయంగా ఉంచడం, వివక్ష, అవినీతి, ఇవన్నీ ఓటు బ్యాంకు రాజకీయాల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ మాట్లాడిన మోదీ బీజేపీ ఇటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఉంటుందని, ఓటు బ్యాంకు రాజకీయాల ప్రతికూలతలను దేశ ప్రజలకు వివరించడంలో సఫలీకృతం అయిందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు గట్టిపోటీ ఇస్తుందని వ్యాఖ్యానించారు. పేదల అభ్యున్నతి కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం శ్రమిస్తుందని పేర్కొన్న మోడీ దేశ పౌరుల జీవితాలను సులభతరం చేయడమే బీజేపీ ప్రభుత్వాల ప్రాధాన్యత అని వెల్లడించారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications