ఫ్యాక్షన్: నడి రోడ్డులో బీజేపీ నాయకుడి కళ్లలో కారం, వేటకోడవళ్లతో నరికి చంపేశారు!
బెంగళూరు నగర శివార్లలో పాతకక్షలు భగ్గుమన్నాయి. పనిపై బయటకు వెలుతున్న బీజేపీ నాయకుడిని నడి రోడ్డులో అతి కిరాతకంగా వేటకోడవళ్లతో నరికి చంపేశారు.
బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలో పాతకక్షలు భగ్గుమన్నాయి. పనిపై బయటకు వెలుతున్న బీజేపీ నాయకుడిని నడి రోడ్డులో అతి కిరాతకంగా వేటకోడవళ్లతో నరికి చంపేశారు. బీజేపీ నాయకుడు హత్యకు గురి కావడంతో కాంగ్రెస్ నాయకుల ఇళ్లకు నిప్పుపెట్లారు.
బీజేపీ ఎస్సీ/ఎస్టీ విభాగం ఉపాధ్యక్షుడు హరీష్ (40) ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైనాడు. బెంగళూరు గ్రామీణ జిల్లాలో హరీష్ బీజేపీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని ప్రత్యర్థులు జీర్ణించుకోలేపోతున్నారని సమాచారం.
సూర్యా సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలో (ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర) హరీష్ బైక్ లో వెలుతున్నాడు. రామసాగర గేట్ సమీపంలో ప్రత్యర్థులు కొన్ని వాహనాల్లో వెళ్లి హరీష్ బైక్ ను అడ్డగించారు. వెంటనే హరీష్ కళ్లలో కారం చల్లడంతో అతను కుప్పకూలిపోయాడు.

వెంటనే నడిరోడ్డు మీద హరీష్ ను వేటకోడవళ్లతో దారుణంగా నకిరి చంపేశారు. రాజేష్ అలియాస్ రాజు, సంతోష్ గ్యాంగ్ హరీష్ ను హత్య చేశారని తెలిసింది. హరీష్ అనుచరులు రాజేష్ ఇంటికి నిప్పంటించి ప్రతీకారం తీర్చుకున్నారు. విషయం తెలుసుకున్న బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ అమిత్ సింగ్ సంఘటనా స్థలానికి పరుగు తీశారు.
ఇదే సంవత్సరం మార్చి 14వ తేదీన దలిత వర్గానికి చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడు కితగానహళ్ళి వాసును నడిరోడ్డులో అతి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీకి చెందిన బోమ్మసంద్ర మునిసిపాలిటి మహిళా కౌన్సిలర్ సరోజమ్మను ఇప్పటికే అరెస్టు చేసి జైలుకు పంపించారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం











Click it and Unblock the Notifications