వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ మద్దతిచ్చినా ‘సీఎం’ ఓటమి -యానాంలో రంగస్వామి పరాజయం -పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలుపు

|
Google Oneindia TeluguNews

ఉత్తరాది పార్టీగా ముద్రపడిన బీజేపీ దక్షిణాదిలో పాగా వేసిన రెండో అసెంబ్లీగా పుదుచ్చేరి నిలిచింది. ఇప్పటిదాకా కర్ణాటకలో మాత్రమే అధికారాన్ని సాధించిన కమలనాథులు.. తమిళనాట అన్నాడీఎంకేతో కలిసి కొత్త ఎత్తులు వేసినా, డీఎంకే ధాటికి నిలవలేకపోయారు. అయితే, తమిళుల డామినేషన్ ఉండే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో బీజేపీతొలిసారి అధికారాన్ని పంచుకోనుంది. ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి బీజేపీ అక్కడ సాధారణ మెజార్టీ సాధించింది. కానీ..

బీజేపీ ఓటమిపై ప్రధాని మోదీ రియాక్షన్ -ఆ రాష్ట్రాలకు కేంద్రం భరోసా -మమత, విజయన్, స్టాలిన్‌కు విషెస్బీజేపీ ఓటమిపై ప్రధాని మోదీ రియాక్షన్ -ఆ రాష్ట్రాలకు కేంద్రం భరోసా -మమత, విజయన్, స్టాలిన్‌కు విషెస్

షాకింగ్ ట్విస్ట్: మమతా బెనర్జీ ఓటమి -నందిగ్రామ్‌లో బీజేపీ సువేందు గెలుపు -ఈసీపై టీఎంసీ నిప్పులు, ఏమైందంటే..షాకింగ్ ట్విస్ట్: మమతా బెనర్జీ ఓటమి -నందిగ్రామ్‌లో బీజేపీ సువేందు గెలుపు -ఈసీపై టీఎంసీ నిప్పులు, ఏమైందంటే..

 అధికారంలోకి బీజేపీ..

అధికారంలోకి బీజేపీ..

మొత్తం 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో అధికార కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. కేవలం 2 సీట్లలోనే హస్తం గుర్తు అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ మిత్రుడైన డీఎంకే కాస్త పర్వాలేదనిపిస్తూ మొత్తం 6స్థానాలను గెలిచారు. ఇండిపెండెట్లు మరో 6 చోట్ల గెలుపొందగా, రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్ 10సీట్లు, దాని మిత్రపక్షం బీజేపీ 6 సీట్లలో గెలిచి సాధారణ మెజార్టీని సాధించాయి. తద్వారా కర్ణాటక తర్వాత దక్షిణాదిలో బీజేపీ అధికారాన్ని సాధించిన రెండో అసెంబ్లీగా పుదుచ్చేరి నిలిచింది. అయితే..

సీఎం అభ్యర్థి పరాజయం..

సీఎం అభ్యర్థి పరాజయం..

ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ పుదుచ్చేరి అంతటా విజయం సాధించి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసేంత మెజార్టీ సాధించినా.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం, ప్రస్తుత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్.రంగస్వామికి యానాంలో ఓటమి తప్పలేదు. ఆయనపై స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ 656 ఓట్లతో విజయం సాధించారు. రంగస్వామికి 16,477 ఓట్లు, శ్రీనివాస్‌కు 17,132 ఓట్లు వచ్చాయి. మొత్తం 15వ రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయింది. అదృష్టవశాత్తూ రంగస్వామి తట్టాన్‌చావడి నుంచి కూడా శాసనసభకు పోటీ చేసి తన సమీప అభ్యర్థి కె.సేతుపై 5456 ఓట్లతో గెలిచారు. దీంతో ఆయన సీఎం పదవికి ఎలాంటి ఢోకా లేనట్లయింది. కాగా,

జగన్ పార్టీ మద్దతు ఇచ్చినా ఓటమి..

జగన్ పార్టీ మద్దతు ఇచ్చినా ఓటమి..

తూర్పుగోదావరి జిల్లాను ఆనుకుని ఉండే (పుదుచ్చేరి) యానాం అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో మల్లాడి కృష్ణారావు పలు మార్లు విజయం సాధించి, మంత్రిగానూ పనిచేశారు. జగన్ పిలిస్తే ఏపీకి సేవలు చేస్తానన్న మల్లాది.. ఈసారి యానాం పోటీ నుంచి తప్పుకుని ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్ రంగస్వామికి మద్దతు పలికారు. ఓవైపు రంగస్వామి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని తెలిసినా.. జగన్ నేతృత్వంలోని వైసీపీ యానాంలో నేరుగా రంగాస్వామికి మద్దతు పలకడం, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి నేతలు నేరుగా ప్రచారంలో పాల్గొనడం ఆసక్తిని రేపింది. కానీ చివరికి యానాంలో రంగస్వామి ఓడిపోయి, స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ గెలవడం వైచిత్రి.

English summary
the BJP-AINRC alliance wins securely and set to form government in union territory Puducherry. AINRC BJP has already crossed magic figure 16 in 30 seated puducherry assembly. but, AINRC president and Former chief minister N Rangaswamy lost election in Yanam constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X