ఆడియో టేపులతో దొరికిపోయిన సీఎం?.. బీజేపీ బిగ్ బాంబ్!
పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ(బీజీపీ) సంచలన ఆరోపణలతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. లైంగిక దాడి కేసులను బలహీనపరచడానికి లేదా పూర్తిగా తొలగించడానికి ప్రైవేట్ దళారులతో కలిసి రూ.5 కోట్ల అవినీతి సిండికేట్ నడుపుతున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ వ్యవహారంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆయన సతీమణి గురుప్రీత్ కౌర్‌ల ప్రమేయం ఉందంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆడియో రికార్డింగులను బయటపెట్టారు.
మీడియా సమావేశంలో ప్రదీప్ భండారీ కొన్ని ఆడియో రికార్డింగ్‌లను వినిపించారు. ఓ దళారి అత్యాచార కేసు నిందితుడి బంధువుతో మాట్లాడుతూ రూ. 5 కోట్ల డబ్బులు మాట్లాడటం, ఆ మొత్తం ఎవరెవరికి పంపిణీ కావాలో చర్చంచడం ఆ ఆడియోల్లో వినిపిస్తోందని ప్రదీప్ భండారీ పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎంవో, సీఎం భార్య పేర్లను దళారి ప్రస్తావించాడని వెల్లడించారు. అయితే ఆ ఆడియోల్లో గొంతు ఎవరిదనేది, నిజంగానే డబ్బు చేతులు మారిందా అనేది స్వతంత్రంగా ధ్రువీకరించబడలేదు.

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ విచారణ ఉత్తర్వులు
ఈ సంచలన ఆరోపణల వెనుక జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ ఆదేశాలు కూడా ఉన్నాయి. పంజాబ్ సీఎం భార్య ప్రమేయంతో అత్యాచార కేసును అణచివేసేందుకు రూ.5 కోట్లు డిమాండ్ చేశారన్న ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇప్పటికే స్పందించింది. పంజాబ్ సీఎస్, డీజీపీలు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, రెండు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అలాగే ఈ అంశాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని మహిళా భద్రతా విభాగానికి కూడా పంపించింది.
మధ్యంతర బెయిల్.. ఫోటోల ఆధారంతో తీవ్ర ఆరోపణలు
పటియాలా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ఉదాహరణగా చూపుతూ బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. మే 13న అరెస్ట్ అయిన నిందితుడు కేవలం వారం రోజుల్లోనే మే 20న ఎలా బెయిల్ పై బయటకు వచ్చాడని ప్రశ్నించారు. ఈ కేసు విచారణను కావాలనే బలహీనపరిచారని ఆరోపిస్తూ.. సీఎం భార్య, సదరు దళారి కలిసి ఉన్న ఓ ఫోటోను కూడా మీడియా ముందు ప్రదర్శించారు. పంజాబ్ పోలీసుల విచారణపై నమ్మకం లేదని, సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
న్యాయపరమైన చర్యలకు దిగిన సీఎం భార్య
మరోవైపు ఈ ఆరోపణలపై పంజాబ్ సీఎం కార్యాలయం స్పందించింది. మాజీ న్యాయమూర్తి రంజిత్ సింగ్ చేసిన ఆరోపణల ఆధారంగానే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు దాఖలైందని చెబుతూ.. ఆ రిటైర్డ్ జడ్జికి సీఎం భార్య గురుప్రీత్ కౌర్ లీగల్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ ఈ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ఆప్ వర్గాలు ఖండించాయి.
LIVE: BJP National Spokesperson Shri @pradip103 addresses press conference at BJP headquarters, New Delhi.https://t.co/coXXJneI8h
— BJP (@BJP4India) September 3, 2026














Click it and Unblock the Notifications