ఆ సర్టిఫికేట్లపైనా ప్రధాని మోడీ ఫొటో పెట్టుకోండి: జితన్ రామ్ మాంఝీ సంచలన విమర్శలు
పాట్నా: ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న హిందుస్థానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎం-ఎస్) అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన విమర్శలు చేశారు. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లపై ఫొటోలు ప్రచురించడం ద్వారా టీకా పంపిణీతో వచ్చే ప్రతిష్టను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
అంతేగాక, కరోనాతో మృతి చెందినవారి మరణ ధృవీకరణ పత్రాలపైనా ప్రధాని ఫొటో వేయాలంటూ ట్విట్టర్ వేదికగా మాంఝీ ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, జార్ఖండ్ లాంటి బీజేపీయేతర పార్టీ పాలిత రాష్ట్రాల్లోనూ ఫొటో రాజకీయాలు చోటు చేసుకుంటుండటం గమనార్హం.

బీహార్‌కు అత్యవసర ఔషధాలు, టీకాలు, ఆక్సిజన్, నిధుల కేటాయింపులో కేంద్రం ద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఇటీవల మాంఝీ విమర్శలు చేయడం చర్చనీయంశంగా మారింది. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ. 5వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని 2020 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామన్నారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఆర్థికంగా కుదేలయ్యారన్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భృతిని మంజూరు చేయాలని సీఎం నితీష్ కుమార్ ను కోరినట్లు మాంఝీ తెలిపారు. తాము ఇతర దేశాల నుంచి వ్యాక్సినేషన్లు తెప్పించేందుకు కృషి చేశామని, దీంతో వచ్చే ప్రతిష్ట తమకూ దక్కాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications