రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు: ఎందుకంటే?

న్యూఢిల్లీ: ఇండియా కూటమి ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద 'ఫిక్స్‌డ్ మ్యాచ్' వ్యాఖ్యపై భారతీయ జనతా పార్టీ (BJP) సోమవారం భారత ఎన్నికల కమిషన్ (ECI)ని ఆశ్రయించింది. ఎటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా బీజేపీకి 400 సీట్ల లక్ష్యాన్ని అందుకోవడం అసాధ్యమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ కోరింది.

ఆదివారం ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి 'లోక్తంత్ర బచావో' ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలలో "మ్యాచ్ ఫిక్సింగ్" చేయడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రయత్నం ద్వారా బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించి, రాజ్యాంగాన్ని మార్చినట్లయితే, దేశం మొత్తం మారుతుందని చెప్పుకోచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంలో తన మనుషుల్ని పెట్టుకుందని ఆరోపించారు.

BJP Approaches Election Commission Over Rahul Gandhi s Match Fixing Jibe at PM Narendra Modi

ఈవీఎం విశ్వసనీయతను కూడా రాహుల్ ప్రశ్నించారు. 'అంపైర్లు, కెప్టెన్‌పై ఒత్తిడి తెచ్చినప్పుడు, ఆటగాళ్లను కొనుగోలు చేసి, మ్యాచ్ గెలవడాన్ని క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. మన ముందు లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. అంపైర్లను ఎవరు ఎంపిక చేశారు? మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇద్దరు ఆటగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు' అని గాంధీ చెప్పినట్లు పీటీఐ పేర్కొంది.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఫిర్యాదు

ప్రధానిపై రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు పలు అంశాలపై తాను ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించానని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.
ఈసీలో ప్రభుత్వానికి మనుషులు ఉన్నారని, ఈవీఎం లేకుండా ఎన్నికల్లో గెలవలేమని ఆయన అన్నారు. రాహుల్.. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా హరిస్తున్నారని అన్నారు. రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+