సీఎం ఇంటి దగ్గర మాజీ న్యాయమూర్తిపై కాల్పులు
లక్నో: ఉత్తరప్రదేశ్ లో హై కోర్టు మాజీ న్యాయమూర్తి, మానవ హక్కుల కమిషన్ సభ్యుడు జస్టిస్ యూ.కే. ధయాన్స్ మీద గుర్తె తెలియని దుండులు కాల్పులు జరిపి హత్య చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే న్యాయమూర్తి ధయాన్స్ తో పాటు ఆయన భార్య, కారు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు.
శుక్రవారం అర్దరాత్రి ఎయిర్ పోర్టు నుంచి ధయాన్స్ తన భార్యతో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యలో దుండగులు ఆయన కారును వెంబడించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇంటికి కూతవేటు సమీపంలోకి కారు రాగానే దుండగులు న్యాయమూర్తి ధయాన్స్ కారు మీద కాల్పులు జరిపారు.

పలు రౌండ్లు కాల్పులు జరపడంతో ధయాన్స్, ఆయన భార్య చాకచక్యంగా తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. న్యాయమూర్తితో పాటు ఆయన భార్యను సురక్షితంగా ఇంటికి పంపించారు.
రాష్ట్రంలో రౌడీయిజం తాండవం చేస్తున్నదని హై కోర్టు మాజీ న్యాయమూర్తి, మానవహక్కుల సంఘం సభ్యుడికి రక్షణ లేకుంటే ఇక సామాన్యులకు ఏమి రక్షణ కల్పిస్తారని బీజేపీ ప్రశ్నించింది. ఇలాంటి రౌడీ రాజకీయాలు చేసేకంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదని బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications