రూ. వెయ్యి కోట్ల ఆస్తి, బెంగళూరులోని గోవిందరాజనగరలో ప్రియాకృష్ణ గోవింద, హ్యాట్రిక్ మిస్!

బెంగళూరు: ఎంఏఎల్ఎల్ బీ విద్యాభ్యాసం చేసి వ్యాపారాల్లో వేల కోట్ల రూపాయలకు పడగలుఎత్తి అతి చిన్న వయసులో రెండు ఎమ్మెల్యే అయిన బెంగళూరులోని గోవిందరాజనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాకృష్ణకు మంగళవారం చేదుఅనుభవం ఎదురైయ్యింది.

తిరస్కరించిన ఓటర్లు

తిరస్కరించిన ఓటర్లు

మూడోసారి ఎన్నికల్లో పోటీ చేసిన ప్రియాకృష్ణను బెంగళూరులోని గోవిందరాజనగర ఓటర్లు ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారు. కర్ణాటక మంత్రి, విజయనగర ఎమ్మెల్యే ఎం. కృష్ణప్ప కుమారుడైన ప్రియాకృష్ణ మే 12వ తేదీ జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు.

మాజీ మంత్రి ఖుషి

మాజీ మంత్రి ఖుషి

రెండుసార్లు ప్రియాకృష్ణ చేతిలో ఓడిపోయిన మాజీ మంత్రి వీ. సోమణ్ణ ఇప్పుడు బీజేపీ టిక్కెట్ మీద పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద ఎమ్మెల్యే అయిన వీ. సోమణ్ణ తరువాత జరిగిన ఆపరేషన్ కమలతో బీజేపీలో చేరారు.

ఉప ఎన్నికల్లో విజయం

ఉప ఎన్నికల్లో విజయం

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వీ. సోమణ్ణ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ప్రియాకృష్ణ అప్పటి మంత్రిగా ఉన్న వీ. సోమణ్ణను ఓడించి మొదటిసారి విదాన సౌధలో అడుగుపెట్టారు. 2013లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రియాకృష్ణ మళ్లీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

రూ. వేల కోట్ల ఆస్తి

రూ. వేల కోట్ల ఆస్తి

2018 శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రియాకృష్ణ ఎన్నికల సంఘానికి రూ. వెయ్యికోట్లకు పైగా ఆస్తులు చూపించి కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత శ్రీమంతుడిగా మొదటి స్థానంలో నిలిచారు. అయితే వేల కోట్ల ఆస్తులు ఉన్న ప్రియాకృష్ణ మళ్లీ ఎమ్మెల్యే అయ్యి హ్యాట్రిక్ సాధించాలని ప్రయత్నించి విఫలం అయ్యారు.

మాజీ మంత్రికి మళ్లీ చాన్స్

మాజీ మంత్రికి మళ్లీ చాన్స్

బెంగళూరులోని గోవిందరాజనగర నియోజక వర్గం ప్రజలు సీనియర్ నాయకుడు, రెండుసార్లు ఓటమిపాలైన మాజీ మంత్రి వీ. సోమణ్ణను ఆదరించి ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. రూ. వెయ్యి కోట్లకుపైగా ఆస్తులు ఉన్న ప్రియాకృష్ణ ఓడిపోవడంతో ఆయన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+