బెంగాల్ హింసపై బీజేపీ చీఫ్ నిరసన దీక్ష .. వేదిక తొలగించిన కలకత్తా పోలీసులు, జేపీ నడ్డా ఫైర్ !!
పశ్చిమబెంగాల్లో ఎన్నికల అనంతరం హింసాకాండ చెలరేగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల అనంతరం విధ్వంసకాండ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బెంగాల్లో చెలరేగిన హింస కారణంగా పలు ఘటనల్లో ఇప్పటివరకు పదకొండు మంది మృతి చెందారు. ఇక రాష్ట్రంలో హింసకు కారణం టీఎంసీ కార్యకర్తలని బీజేపీ , బీజేపీ వల్లే హింస అని టీఎంసీ ఆరోపణలు చేసుకుంటున్నాయి.
తృణమూల్ పార్టీకి చెందిన కార్యకర్తల దాడిలోతమ పార్టీ కార్యకర్తలు ఆరుగురు మరణించారని,అందులో ఒక మహిళ కూడా ఉన్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో చెలరేగిన హింసపై బీజేపీ నేత జేపీ నడ్డా బెంగాల్లో ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు.

జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్ తో కలిసి నిన్న, ఈరోజు నిరసన ధర్నా కొనసాగిస్తున్న క్రమంలో, ఈ రోజు బీజేపీ ప్రధాన కార్యాలయం సమీపంలో జేపీ నడ్డా కార్యక్రమానికి సిద్ధం చేసిన వేదికను కలకత్తా పోలీసులు తొలగించారు. దీనిపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల ఫలితాల అనంతరం హింసాకాండ నేపథ్యంలో ప్రాణాలు పోగొట్టుకున్న బిజెపి కార్యకర్తల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు కొనసాగించాల్సిన ఆందోళన, కలకత్తా పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద కొనసాగుతుంది.

Recommended Video
కలకత్తాలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న జేపీ నడ్డా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, పశ్చిమ బెంగాల్ ప్రజలను రాజకీయ హింస నుండి రక్షించడానికి తాము ప్రయత్నిస్తామని ప్రమాణం చేశారు. ఈ క్రూరత్వాన్ని సహించేది లేదని, బిజెపి కార్యకర్తల పక్షాన అండగా ఉండటానికి తాను నార్త్ 24 పరగణాలు వంటి జిల్లాలను సందర్శిస్తానని, బెంగాల్ లో బీజేపీ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. బెంగాల్లో జరిగిన హింసాకాండపై దేశం మొత్తానికి అర్థమయ్యేలా చెప్తామని జెపి నడ్డా నిరసన దీక్ష సందర్భంగా పేర్కొన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications