గాలి జనార్దన్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి ముగ్గురు పవర్ ఫుల్ లీడర్లు, ఎవరు బాహుబలి !
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ నుంచి బయటకు వచ్చి కేఆర్ పీ పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. గాలి జనార్దన్ రెడ్డి పోటీ చేస్తున్న గంగావతి నియోజక వర్గంలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలో బలమైన పవర్ ఫుల్ రాజకీయ నాయకులను రంగంలోకి దింపడంతో అక్కడ ఎవరు బాహుబలి అని ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటక రాజకీయాల్లో గతంలో చక్రం తిప్పిన గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో జైలుకు వెళ్లి తరువాత బెయిల్ మీద బయటకు వచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరులు బీజేపీలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా గాలి జనార్దన్ రెడ్డి మాత్రం ఆ పార్టీకి దూరం అయ్యారు. గత డిసెంబర్ నెలలో బీజేపీ నుంచి బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక కల్యాణ ప్రగతి పార్టీని స్థాపించారు.

గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీకి ఎన్నికల అధికారులు ఫుట్ బాల్ సింబల్ కేటాయించారు. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన భార్య లక్ష్మీ అరుణతో సహ ఆయన అనుచరులు ఫుల్ బాల్ సింబల్ మీద అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి సతీమణి గాలి లక్ష్మీ అరుణ బళ్లారి సిటీ నుంచి పోటీ చెయ్యడానికి ఇప్పటికే నామినేషన్ వేశారు.
గాలి జనార్దన్ రెడ్డి కూడా గంగావతి నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి మంగళవారం నామినేషన్ వేశారు. గంగావతిలో గెలుపు నాదే అని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే గంగావతిలో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పరణ్ణ మునవళ్లి, కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడు ఇక్బాల్ అన్సారీని ఆ పార్టీలు రంగంలోకి దింపాయి.

ఇక జేడీఎస్ పార్టీ నుంచిహెచ్ఆర్, చెన్నకేశవను ఆ పార్టీ నాయకులు రంగంలోకి దింపారు. గాలి జనార్దన్ రెడ్డి మీద పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు చిన్నాచితకా నేతలు కాదు. ముగ్గురు కూడా చాలా పవర్ ఫుల్ నాయకులే. ఎలాగైనా గాలి జనార్దన్ రెడ్డిని ఓడించాలని మూడు పార్టీల నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. అయితే మే 10వ తేదీన గంగావతి ప్రజలు ఏ నాయకుడికి ఓటు వేశారు అని మే 13వ తేదీన తేలిపోనుంది.












Click it and Unblock the Notifications