ముస్లిం ఇంటికి తాళం వేసిన బీజేపీ కౌన్సిలర్

లక్నో: బ్రాహ్మణులు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతంలో ముస్లీంలు ఎందుకు నివాసం ఉంటున్నారని ఒక బీజేపీ నేత మండిపడ్డారు. ఎంత చెప్పినా వినిపించుకోకుండ రాత్రి సోంత ఇంటిలో నివాసం ఉంటున్న ముస్లీం మహిళ, ఆమె కుటుంబ సభ్యలను బయటకు నెట్టి ఇంటికి తాళం వేశాడు.

ఇలా చేసింది ఒక ప్రజా ప్రతినిధి. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన కౌన్సిలర్. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లోని కథ్ గర్ ఏరియా కౌన్సిలర్ విద్యాశరణ్ శర్మ జైలుకు వెళ్లాడు. కథ్ గర్ ఏరియాలో బ్రాహ్మణులు ఎక్కువగా నివాసం ఉంటున్నారు.

ఈ ప్రాంతం నుండి విద్యాశరణ్ శర్మ బీజేపీ కౌన్సిలర్ గా గెలుపోందారు. ఈ ప్రాంతంలో షహనా పర్వీన్ అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నది. ఆమెది సొంత ఇల్లు. అయితే చాల కాలం నుండి మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్లి పోవాలని శర్మ ఆమెకు చెప్పాడు.

BJP councillor locks out Muslim family in Uttar Pradesh,

అయితే ఆమె సోంత ఇల్లు కావడంతో అక్కడే నివాసం ఉంటున్నారు. ఆమెకు శర్మ నుండి వేధింపులు ఎక్కువ అయ్యాయి. తమ మద్య నువ్వు ఉండరాదని పదేపదే బెదిరించాడు.

తాము ఆస్తి అమ్ముకుని వెళ్లి పోతామని షహనా పర్వీన్ చెప్పింది. అందుకు శర్మ అంగీకరించలేదు, చివరికి బుధవారం రాత్రి షహనా పర్వీన్ , ఆమె కుటుంబ సభ్యులను ఇంటిలో నుండి బయటకు లాగి తాళం వేశాడు. ఈ ఇంటిని ఎవ్వరికి అద్దె కు ఇవ్వడానికి తాము అంగీకరించమని హెచ్చరించాడు.

షహనా పర్వీన్ ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. శర్మను అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తాము ముస్లీంలకు వ్యతిరేకం కాదని, అందరూ కలిసి ఉందామని చెబుతుంటే సొంత బీజేపీ నాయకులు ఈ విధంగా చెయ్యడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్న ఉదయిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+