వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెసు చీలికపై ఆశ: ఢిల్లీపై పీఠంపై కన్నేసిన బిజెపి

By Pratap
|
Google Oneindia TeluguNews

BJP eyes Cong split to form govt
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపై బిజెపి నాయకత్వం దృష్టి పెట్టింది. ఎన్నికలను నివారించడానికి కాంగ్రెసు పార్టీ చీలిపోయి బిజెపికి మద్దతు ఇచ్చే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దాదాపు 8 మంది కాంగ్రెసు శాసనసభ్యులు బిజెపికి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది.

బిజెపి జాతీయాధ్యక్షుడిగా అమిత్ షా, ఢిల్లీ శాఖాధ్యక్షుడిగా సతీష్ ఉపాధ్యాయ నియామకం జరిగిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రయత్నాల్లో వేగం పెరిగింది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై అమిత్ షా పార్టీ నాయకులను సంప్రదించే అవకాశాలున్నాయి.

అయితే, తమ పార్టీ శాసనసభ్యుల్లో చీలిక రాదని ఢిల్లీ కాంగ్రెసు చీఫ్ అర్విందర్ సింగ్ అంటున్నారు. అయితే, బిజెపి నాయకులకు, కాంగ్రెసు శాసనసభ్యులకు మధ్య అనధికారిక చర్చలు జరిగినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.

కాంగ్రెసు చీలిక గ్రూప్ మద్దతు ఇస్తే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. బిజెపి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. బిజెపి ఢిల్లీ శాఖ ముందస్తు ఎన్నికలకు వ్యతిరేకంగా ఉంది. దీంతో తాము అన్ని ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టామని, బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే వచ్చే జనవరి వరకు రాష్ట్రపతి పాలన పొడిగించే అవకాశం ఉందని బిజెపి నాయకులు అంటున్నారు.

English summary
Prospects of government formation in Delhi could hinge on a group of Congress MLAs breaking away to support a BJP government to avoid fresh assembly polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X