బీజేపీ నెక్ట్స్ టార్గెట్ క్రిస్టియన్ భూములే..!!

పార్లమెంటులో వక్ఫ్ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం పార్లమెంటులో పాస్ అయ్యింది. అనంతరం రాష్ట్రపతి ముర్ము కూడా ఆమోదం తెలపడంతో బిల్లు చట్టరూపం దాల్చింది. వక్ఫ్ బిల్లుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పార్టీలు మద్దతు తెలపగా.. విపక్షాలు వ్యతిరేకించాయి. కొన్ని పార్టీలు బిల్లును వ్యతిరేకిస్తూ కోర్టు తలపులు తట్టాయి. ఇదిలా ఉంటే వక్ఫ్ బిల్లుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాక్రే.

నెక్ట్స్ టార్గెట్ క్రిస్టియన్ భూములు
"వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు హక్కుగా ఉన్న ఆస్తులను లాక్కున్నారు, వారి తర్వాత బీజేపీ కన్ను క్రైస్తవులు, జైనులు, బౌద్ధులతో పాటు ఇతర హిందూ ఆలయాల ఆస్తులపై పడింది" అని ఆరోపించారు ఉద్ధవ్ థాక్రే.ఈ భూములన్నిటినీ బీజేపీ తమ స్నేహితులకు అప్పనంగా పంచి పెడుతుందని వ్యాఖ్యానించారు. శివసేన పార్టీకి చెందిన కొత్త ఐటీ కమ్యూనికేషన్ వింగ్ శివ్ సంచార్ సేన ప్రారంభోత్సవం సందర్భంగా థాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఏ ఒక్క మతంపై గౌరవం లేదని దుయ్యబట్టారు. గత వారం సుదీర్ఘ చర్చ అనంతరం వక్ఫ్ బిల్లు ఉభయ సభల్లో పాస్ అవగా, శనివారం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లుకు ఆమోదం తెలిపారు.

bjp-eyes-next-on-christian-lands-sensational-comments-by-shiv-sena-chief-uddhav-thackeray

ఆ పారిశ్రామికవేత్తల కోసమే..
బీజేపీ ఇతర మతాల ఆస్తులపై కన్నేసిందనే విషయం తాను చెప్పడం లేదని బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఒక ఆర్టికల్‌లో బహిరంగంగానే వెల్లడించిందని ఉద్ధవ్ గుర్తు చేశారు.అందరూ కళ్లు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని థాక్రే అన్నారు. అయితే ఇప్పుడు ఆ ఆర్టికల్ మాయమైందని కూడా చెప్పారు. వక్ఫ్ బిల్లుపై ఇతర విపక్ష పార్టీల్లా కోర్టును ఆశ్రయిస్తారా అన్న ప్రశ్నకు.. కోర్టుకు వెళ్లే ఆసక్తి లేదని సున్నితంగా చెప్పారు. బీజేపీ 45వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్న వేళ శ్రీరామచంద్రుడిలా విలువలతో నడుచుకోవాలని కమలం పార్టీకి ఉద్ధవ్ హితవు పలికారు.ఇక శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ కూడా వక్ఫ్ బిల్లుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి భూమి లాక్కుని బీజేపీ తమ పారిశ్రామికవేత్తలైన తన స్నేహితులకు కట్టబెడుతుందని ఆరోపించారు. ఇక పేదరికం గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు సంజయ్ రౌత్. గత ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ చేసిన ఖర్చు ఒక మహారాష్ట్ర బడ్జెట్‌తో సమానం అన్నారు.

క్యాథలిక్ చర్చ్ అధీనంలో భూములు
ఇదిలా ఉంటే శరద్‌పవార్ పార్టీ ఎన్సీపీ నేత జితేందర్ అవ్‌హద్ వక్ఫ్ బిల్లుపై మాట్లాడుతూ ముస్లింల తర్వాత బీజేపీ తదుపరి టార్గెట్ క్రిస్టియన్స్ అని చెప్పారు. ఆర్ఎస్ఎస్ రాసుకొచ్చిన ఆర్టికల్‌ను అవ్‌హద్ గుర్తుచేశారు. దేశంలో ప్రభుత్వ అధీనంలో ఉన్న భూముల తర్వాత అత్యంత ఎక్కువ స్థాయిలో భూములున్నది క్యాథలిక్ చర్చ్‌కని పదే పదే ఆర్ఎస్ఎస్ చెప్పుకొచ్చిందన్నారు. వాస్తవానికి వక్ఫ్ బోర్డు కంటే ఎక్కువగా భూములున్నది క్యాథలిక్ చర్చ్‌కే అని ఆర్ఎస్ఎస్ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. దేశంలో ప్రభుత్వం తర్వాత ఎక్కువ భూములున్నది ఎవరికి అనే చర్చ జరుగగా ఏప్రిల్ 3వ తేదీన అది పబ్లిష్ అయినట్లు తెలిపారు.

క్యాథలిక్ చర్చి అధీనంలో 17.29 కోట్ల ఎకరాల భూమి దేశంలో ఉన్నట్లు ఆర్ఎస్ఎస్ పత్రిక వెల్లడించిందని చెప్పారు. అయితే ఇందులో ఎక్కువ భాగం భూమి బ్రిటీషు పాలనలోనే ఇవ్వడం జరిగింది. 1927లో నాటి బ్రిటీషు ప్రభుత్వం ఇండియన్ చర్చ్ చట్టాన్ని తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున క్యాథలిక్ చర్చికి భూములు బదిలీ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆర్ఎస్ఎస్‌కు చెందిన ఈ పత్రిక రాజ్యాంగాన్ని, మూడు రంగుల జెండాను 1950లో వ్యతిరేకించిన విషయాన్ని అవ్‌హద్ గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+