బీజేపీ సెల్ఫ్ గోల్..పరాభవం: సత్తా లేదని తెలిసినా..చీలకలపై ఆశలతో: భారీ దెబ్బ కొట్టిన కూటమి..!
జాతీయ రాజకీయాల్లో తిరుగు లేని శక్తిగా ఎదిగిన జీజేపీ..మహారాష్ట్రలో మాత్రం తీరుకోలని ఎదురుదెబ్బ తిన్నది. ఒక రకంగా అత్యుత్సాహం ప్రదర్శించి సెల్ఫ్ గోల్ చేసుకుంది. అర్దరాత్రి హడావుడి నిర్ణయాలతో
తమకు మోసం చేసిన శివసేనను దెబ్బ తీయాలి..ఆ పార్టీకి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వకూడదనే లక్ష్యంతో ముందుడుగు వేసారు. రాత్రికి రాత్రే రాజకీయాలు మొదలు పెట్టి..తెల్లవారే సరికి రాష్ట్రపతి పాలన ఎత్తివేసి పఢ్నవీస్ తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ సమయంలో ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ సహకారం కోరి..ఆయన ఇచ్చిన హామీని నమ్మి..ముందు..వెనుక ఆలోచించకుండా వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అజిత్ కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఇక..బల నిరూపణ కు ఈ నెల 30వ తేదీ వరకు సమయం ఇచ్చారు. ఇంతలో ప్రత్యర్ధులుగా ఉన్న మూడు పార్టీల కూటమి సుప్రీంను ఆశ్రయించింది. అక్కడ బీజేపీ ఆశలను అడియాసలు చేస్తూ..ఫడ్నవీస్ బల నిరూపణకు కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇచ్చింది. దీంతో..బీజేపీ ఆటను మధ్యలోనే వదిలేసింది. నాలుగు రోజుల ముఖ్యమంత్రి పదవిని వీడాల్సి వచ్చింది.

బీజేపీ సెల్ఫ్ గోల్...
జాతీయ రాజకీయాల్లో ప్రధాని మోదీ..బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా రాజకీయ చాణక్యానికి ఎదురు లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో తమకు ఎదురు లేదనే భావనతో ఉన్న బీజేపీ..మహారాష్ట్రలో హడువుడిగా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు బెడిసి కొట్టాయి. అవి సెల్ఫ్ గోల్ గా మారాయి. శివసేనతో విభేదాలు వచ్చిన తరువాత గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఆహ్వానించినా..తమకు బలం లూదని వెనక్కు తగ్గిన బీజేపీ..కేవలం నాలుగు రోజుల తేడాతో ధోరణి మార్చుకుంది. గత శనివారం మూడు పార్టీల కూటమి నుండి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తమ మాజీ మిత్రుడు ఉద్దవ్ థాక్రే పేరు ప్రకటించాలని నిర్ణయించారు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి దక్కకూడదనే ఉద్దేశంతో..అర్దరాత్రి మంతనాలను బీజేపీ తెర తీసింది. శుక్రవారం అర్ద్రరాత్రి తరువాత మొదలైన మంతనాలు శనివారం తెల్లవారే వరకూ కొనసాగాయి. ఆ వెంటనే అనూహ్యంగా పడ్నవీస్ ముఖ్యమంత్రిగా..ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.

బలం లేదని తెలిసినా..చీలకలపైనే..
తమకు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం లేదని బీజేపీకి బాగా తెలుసు. అదే విషయాన్ని గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించిన విషయంలో స్పష్టం చేసింది. కానీ, ఆ తరువాత గవర్నర్ శివసేన .. ఎన్సీపీకి అవకాశం ఇచ్చారు. ఎన్సీపీ తమకు ఇచ్చిన సమయం పొడిగించాలని కోరింది. దీంతో..గవర్నర్ నివేదిక మేరకు అకస్మికంగా కేంద్రం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించింది. ఆ తరువాత కూటమి అధికారం ఏర్పాటు చేయటం ఖరారు కావటంతో..తమ చేతిలో ఉన్న అధికారాలకు పదును పెట్టింది. అర్ద్రరాత్రి రాష్ట్రపతి పాలన ఎత్తివేసింది. అప్పటికే తమతో చేతులు కలిపిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ ను పూర్తిగా నమ్మింది. ఆయనతో సహా..శివసేన..అదే విధంగా కాంగ్రెస్ ను కొంత మంది బయటకు వస్తారని..తమకు మద్దతిస్తారని బీజేపీ నేతలు ఆశించారు. కానీ, అది ఆశాభంగంగానే మారింది. ఇతర పార్టీల నేతలు ఎవరూ బీజేపీతో కలిసేందుకు ముందుకు రాలేదు. అదే సమయంలో తమకు మద్దతుగా ఎన్సీపీ నుండి అజిత్ పవార్ తో పాటుగా వచ్చిన వారు సైతం తిరిగి సొంత గూటికి వెళ్లిపోయారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక, చీలకలు సాధ్యం కాదని గుర్తించింది.

పరువు కాపాడుకొనేందుకు..చివరకు..
ఇక, సుప్రీం కోర్టు సైతం ఫడ్నవీస్ బలం నిరూపించుకొనేందుకు ఒక్క రోజు సమయం ఇచ్చింది. దీనికి ముందు రోజు రాత్రి మూడు పార్టీల కూటమి తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సభ్యులతో లకిసి పేరేడ్ నిర్వహించింది. బీజేపీ మాత్రం తమ బలం గురించి ఎక్కడా స్పష్టత ఇవ్వలేక పోయింది. ఇదే సమయంలో అజిత్ పవార్ లోనూ మార్పు కనిపించింది. ఇక, ఎన్సీపీ నుండి చీలిక సాధ్యం కాదని బీజేపీ గుర్తించింది. దీంతో..ఇప్పటికే డామేజ్ అయ్యామని..మరింతగా పదవుల కోసం పట్టుబడి..రాజకీయాలు చేస్తే త్వరలో జరిగే జార్ఖండ్ ఎన్నికలతో పాటుగా..జాతీయ స్థాయిలోనూ పార్టీ ఇమేజ్ డామేజ్ అవుతుందని గ్రహించింది. దీంతో..రాజ్యాంగ దినోత్సవం నాడు రాజ్యంగ విలువలు కాపాడుతామంటూ..ఎంత అనూహ్యంగా ముఖ్యమంత్రి..ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారో.. అదే స్థాయిలో ముందుగా అజిత్ పవార్..ఆ తరువాత ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా బీజేపీ నేతలు సమాధానం చెప్పుకోలేని స్థితిలో చిక్కుకున్నారు.












Click it and Unblock the Notifications