వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ? కాంగ్రెస్ అధిక్యం ఎన్నిస్థానాల్లో అంటే

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా జరిగిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలతోపాటు 17 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడున్నాయి. హర్యానాలో బీజేపీకి అధికారం చేజారే పరిస్థితి కనిపిస్తున్నది. మహారాష్ట్రలో అధికారం నిలబెట్టుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాగా, గుజరాత్‌లో కాషాయానికి కంచుకోటగా మారిన కొన్ని స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ పడే పరిస్థితి కనిపిస్తున్నది.

గుజరాత్‌లో మొత్తం ఆరుస్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. థరడ్, ఖేరలు, అమ్రైవాడీ, లునావాడా, రాధాన్‌పూర్, బయద్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇక ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకొన్నట్టు కనిపిస్తున్నది. ఈ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నది. రాధాన్‌పూర్, బయద్, అమ్రైవాది, లునావాదా స్థానాల్లో అధిక్యంలో ఉంది.

BJP faces tough in Gujarat Bypolls: Congress leading in four seats

బయద్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధవళ్‌సింగ్ జాలాపై కాం్గరెస్ అభ్యర్థి జాషు పటేల్ 50 వేల ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇక హర్యానా, మహారాష్ట్రలో కూడా బీజేపీ పూర్తిస్థాయిలో ప్రభావ చూపలేదనే విషయాన్ని ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు సూచిస్తున్నాయి. కేరళ, యూపీలో అధిక్యాన్ని ప్రదర్శించినప్పటికీ.. సత్తా చాటలేకపోయిందనే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.

రాధాన్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి అల్పేష్ ఠాకూర్‌పై సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి రఘు దేశాయ్ అధిక్యంలో ఉన్నారు. వీరిమధ్య గట్టి పోటీ నెలకొన్నట్టు సమాచారం.

అమ్రైవాదీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ధర్మేంద్ర పటేల్ 1524 ఓట్ల తేడాతో అధిక్యంలో కొనసాగుతున్నట్టు తెలిసింది.

ఖేరలు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి బాబుజీ ఠాకూర్‌పై బీజేపీ అభ్యర్థి అజ్మల్‌జీ ఠాకూర్ విజయం సాధించారు.

గుజరాత్‌లో మొత్తం ఆరుస్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. థరడ్, ఖేరలు, అమ్రైవాడీ, లునావాడా, రాధాన్‌పూర్, బయద్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

English summary
Gujarat assembly Bypolls results 2019: Check out the results of MH Assembly Election constituency wise results. Know more about Maharashtra election results 2019 here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X