ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై పోటీకి కేంద్రమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్‌ను దించిన బీజేపీ

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికీ నేతలు పార్టీలు మారుతూనే ఉన్నారు. అంతేగాక, గతంలో ఎన్నడూ లేని విధంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత అఖిలేష్ యాదవ్ ఈ మేరకు ఎన్నికలకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో యోగి ఆదిత్యనాథ్ ప్రత్యర్థి, అఖిలేష్ యాదవ్ ప్రత్యర్థి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా, అఖిలేష్ ప్రత్యర్థి ఖరారయ్యారు. అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేంద్రమంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

BJP fields Union Minister SP Singh Baghel against Akhilesh Yadav from Karhal seat.

కాగా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ కుమార్ యాదవ్ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. మెయిన్‌పురిలోని కర్హల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అఖిలేష్ తోపాటు పలువురు ఎస్పీ అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు దాఖలు చేశారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన ఆజంగఢ్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. 1993 నుంచి కర్హల్ నుంచి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతుండటం గమనార్హం. 2002లో మాత్రం ఎస్పీ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ప్రస్తుతం కర్హల్ నుంచి ఎస్పీ నేత సోబరన్ సింగ్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

సొంతపట్టణం నుంచి సైఫై నుంచి కలెక్టరేట్ ఆఫీసుకు వచ్చి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అఖిలేష్ యాదవ్ తోపాటు మరో ముగ్గురు ఎస్పీ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో తాను కూడా బరిలో దిగాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించుకున్నారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అర్బన్ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికై నుంచే యూపీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

ఫిబ్రవరి 20న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశలో మెయిన్‌పురి స్థానానికి ఓటింగ్ జరగనుంది. సమాజ్‌వాదీ పార్టీ పితామహుడు మరియు అఖిలేష్ యాదవ్ తండ్రి, ములాయం సింగ్ మెయిన్‌పురి స్థానం నుంచి లోక్‌సభలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ప్రారంభం కానున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+