మోడీకి ప్రాణహాని, హత్యకుట్ర బీజేపీ ధ్వజం.. ప్రధాని రక్షణకోసం ప్రాణాలైనా అర్పిస్తానన్న పంజాబ్ సీఎం

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై బిజెపి నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న సమయంలో మోడీ పర్యటనలో ఎలాంటి భద్రత వైఫల్యాలు లేవని పేర్కొన్న పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ ప్రధాని నరేంద్ర మోడీ భద్రత విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

    PM Modi Security Lapse: BJP VS Congress | Article 356 | Oneindia Telugu
    పంజాబ్ పీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం .. ప్రాణాలతో వెళ్తున్నా అన్న పీఎం

    పంజాబ్ పీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం .. ప్రాణాలతో వెళ్తున్నా అన్న పీఎం

    దాదాపు అరగంట పాటు ఫిరోజ్ పూర్ లోని ఫ్లైఓవర్ పైన ఇరుక్కుపోయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమంలో పాల్గొన కుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. నిరసనకారులు మోడీ కాన్వాయ్ అడ్డుకునే ప్రయత్నం చేస్తారని, భద్రత సమస్య తలెత్తుతుందని ఫిరోజ్ పూర్ లోని ఫ్లైఓవర్ పైన దాదాపు అరగంట పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాన్వాయ్ ను ఆపారు. సరైన భద్రత లేని కారణంగా ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే దీనిపై స్పందించిన ప్రధాని ప్రాణాలతో వెళుతున్నాం అంటూ మీ సీఎంకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.

     ప్రధాని రక్షణ కోసం తన ప్రాణాలు అర్పిస్తాను అన్న పంజాబ్ సీఎం

    ప్రధాని రక్షణ కోసం తన ప్రాణాలు అర్పిస్తాను అన్న పంజాబ్ సీఎం

    దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ తన "పశ్చాత్తాపం" వ్యక్తం చేశారు. అయితే భద్రతా లోపం లేదని కూడా అన్నారు."ప్రధానమంత్రిని రక్షించడానికి నేను నా ప్రాణాలను అర్పిస్తాను," అంటూ ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోడీ కిఎటువంటి ప్రమాదం జరగలేదని వ్యాఖ్యానించారు. తనకు ప్రధాని పట్ల ఎంతో గౌరవం ఉందని, విమానాశ్రయంలో ప్రధానిని తానే రిసీవ్ చేసుకోవాల్సి ఉందని కాకపోతే తనతో సన్నిహితంగా ఉన్న వ్యక్తికి కరుణ పాజిటివ్ రావడంతో తాను వెళ్ళలేకపోయాను అని చరణ్ జీత్ సింగ్ చన్నీ వ్యాఖ్యానించారు

    ప్రధానిపై హత్యా కుట్ర అంటూ బీజేపీ ధ్వజం

    ప్రధానిపై హత్యా కుట్ర అంటూ బీజేపీ ధ్వజం

    అయితే ఈ వ్యవహారంలో పంజాబ్ లోని అధికార కాంగ్రెస్ కు, దేశంలో అధికారంలో ఉన్న బిజెపి కి మధ్య రగడ కొనసాగుతోంది. పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డు మార్గంలో ప్రయాణించేటప్పుడు అవసరమైన బ్యాకప్‌తో సహా ప్రధానికి అత్యంత ప్రాథమిక భద్రతా అవసరాలను విస్మరించిందని కేంద్రం ఆరోపించింది. బిజెపి తీవ్ర ఆరోపణలు చేసింది.కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ హత్య కుట్ర విఫలమైందని వ్యాఖ్యానించారు.హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రధానికి హాని కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా కుట్ర పన్నారనే ఆరోపణను పునరావృతం చేశారు. భద్రతా ఉల్లంఘనను "కాంగ్రెస్ చేసిన ఉద్దేశపూర్వకంగా చేసిన సంఘటన"గా అభివర్ణించారు.

    మోడీ ప్రయాణం చేస్తున్న మార్గంలో రైతుల ఆందోళన

    మోడీ ప్రయాణం చేస్తున్న మార్గంలో రైతుల ఆందోళన

    పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టం తీసుకురావాలని, పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరసనకారులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం ఒక సంవత్సరం పాటు సాగిన తర్వాత వ్యవసాయ చట్టాలను ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది నవంబర్‌లో రద్దు చేశారు. అయితే తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్లో ఇంకా రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్న నేపథ్యంలో నిరసనకారులు ఉన్న రూట్ లోనే ప్రధాని కాన్వాయ్ వెళ్లడంతో ఇబ్బంది తలెత్తిందని చెప్తున్నారు పంజాబ్ సీఎం.

     వేరే రూట్ లో వెళ్ళాలన్నా అదే మార్గం ఎంచుకున్న పీఎం

    వేరే రూట్ లో వెళ్ళాలన్నా అదే మార్గం ఎంచుకున్న పీఎం


    రోడ్డు పై కూర్చుని నిరసన తెలుపుతున్న వారికి ముందే ప్రధాని కాన్వాయ్ ఆగిపోయిందని నిరసనకారులు ని అక్కడి నుంచి తొలగించడం కోసం 10 నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని వేరే రూట్లో వెళ్లాలని సూచించినా వారి ఇదే దారి ఎంచుకున్నారని చరణ్ జీత్ చన్నీ తెలిపారు. ఇందులో ఎలాంటి భద్రతా వైఫల్యం లేదని చెప్తున్నారు. కావాలని బీజేపీ ఈ తరహా చర్యకు దిగిందని కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    మోడీ ఎన్నికల సభకు జనాలు లేరన్న కాంగ్రెస్ .. అందుకే వెళ్లిపోయారని ఎదురు దాడి

    ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు చేస్తున్న హత్యకు కుట్ర జరుగుతుందంటూ చేసిన ఆరోపణలను ఖండించారు. మోడీ ఎన్నికల సభకు జనాలు లేరని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రధానమంత్రి పాల్గొనవలసిందిగా సభలో 70 వేల కుర్చీలు ఏర్పాటు చేస్తే, ఏడు వందల మంది కూడా హాజరు కాలేదని ఈ క్రమంలోనే ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారని, ఇందులో భద్రతా వైఫల్యం లాంటి సమస్య ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+