బీజేపీని ముంచినా తేల్చినా వారే..!

జమ్మూ -కాశ్మీర్, హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. జమ్మూ -కాశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి, హర్యానా రాష్ట్రంలో బీజేపీ కూటమి విజయం సాధించాయి. వీటి తర్వాత త్వరలో జార్ఖండ్ , మహారాష్ట్ర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ కూటమే అధికారంలో ఉంది. దీంతో జార్ఖండ్ రాష్ట్రంలో ఈసారి జరిగే ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది. గత ఎన్నికల్లో తృటిలో చేజారిన విజయాన్ని ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

దీనిలో భాగంగానే బూత్ స్థాయి నుంచి పార్టీ కార్యకర్తలను బలోపేతం చేస్తోంది. జార్ఖండ్‌లో తన పరిధిని విస్తరించడానికి ప్రాంతీయ పార్టీలతో పొత్తులను కూడా ఆ పార్టీ చురుకుగా కొనసాగిస్తోంది.ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (AJSU) వంటి భాగస్వాములతో ఈ వ్యూహాత్మక సహకారంతో పాటు, జనతాదళ్ యునైటెడ్ (JDU)తో చర్చలు జరిపి రాష్ట్రంలో తమ బలం మరింత పెంచుకునేలా ప్రణాళికలు రచిస్తోంది.

BJP focused on coming to power in the state of Jharkhand

ముఖ్యంగా ఏజేఎస్‌యూతో పొత్తు పెట్టుకోవడం ద్వారా గత ఎన్నికల్లో బీజేపీ కోల్పోయిన గిరిజన ఓట్లను తిరిగి చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పని చేస్తోంది. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోన్నట్టు కనిపిస్తోంది. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో గిరిజన ఓటర్లే కీలకం. రాష్ట్ర జనాభాలో దాదాపు 23% గిరిజన ఓటర్లే ఉన్నారు.దీంతో వీరిని ఆకర్షించే ప్రయత్నాల్లో బీజేపీ మునిగిపోయింది. బీజేపీ ఇప్పటికే మయూర్‌భంజ్‌లోని గిరిజన నియోజకవర్గాల్లో పటిష్టంగా కనిపిస్తోంది

సుందర్‌ఘర్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకునే దిశగా ఆ పార్టీ నేతలు అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో గిరిజన ఓటర్ల మద్దతుతో హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే హేమంత్ సోరెన్‌ పాలనపై గిరిజన ఓటర్లలో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకునే పనిలో బీజేపీ నిమగ్నమైంది. దీనిలో భాగంగానే గిరిజన ఓట్లే లక్ష్యంగా బీజేపీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోను సిద్ధం చేస్తోంది. వారి భావించినట్టు గిరిజన ఓటర్లు బీజేపీ కూటమికి మద్దతుగా నిలిస్తే, రాష్ట్రంలో కాషాయ పార్టీ పాగా వేయడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+