ఆస్తుల కేసు: సీబీఐ కోర్టుకు జగన్, 23కు వాయిదా
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ కోర్టు వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జగన్‌తో పాటు పలువురు కోర్టుకు హాజరయ్యారు. న్యాయస్థానం కేసును 23వ తేదీకి వాయిదా వేసింది.

దినేష్ రెడ్డి ఆస్తుల కేసు విచారణ వాయిదా
మాజీ డీజీపీ దినేష్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణను సుప్రీం కోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది. జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ ఎన్ఏ బాబ్డే, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేలతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు సోమవారం వచ్చింది.
కేసును అధ్యయనం చేయడానికి తమకు మరింత సమయం కావాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో విచారణను మరో వారం రోజుల పాటు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications