ఢిల్లీ ఎన్నికలు: బీజేపీకి 45 ఏఏపీకి 25 సీట్లు, కేజ్రీవాల్ కంటే బేడీ టాప్

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తుందని రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్(ఆర్ఢీఐ) చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ఆర్డీఐ చేపట్టిన సర్వేలో బీజేపీకి 41-45 స్థానాలు వస్తాయని తెలిసింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి 21-25 సీట్లు వస్తాయని, అది రెండో స్థానంలో నిలుస్తుందని తేలింది.

భారతీయ జనతా పార్టీ 41 శాతం ఓట్లు సాధిస్తుందని, ఆమ్ ఆద్మీ పార్టీ 36 శాతం సాధిస్తుందని వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 12 శాతం ఓట్లు మాత్రమే సాధిస్తుందని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ సున్నా నుండి నాలుగు సీట్లను మాత్రమే గెలుచుకుంటుందని తేలింది.

ముఖ్యమంత్రి రేసులో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ ఇప్పుడు ముందంజలో ఉన్నారు. 46 శాతంతో ఆమె ముందున్నారు. అరవింద్ కేజ్రీవాల్ వైపు 40 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. మొన్నటి వరకు కిరణ్ బేడీ రెండో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత అజయ్ మాకెన్‌కు కేవలం 12 శాతం మాత్రమే ఓట్లువచ్చాయి. కాగా, ఈ సరవే జనవరి చివరి వారంలో చేపట్టినట్లు తెలిపింది. 21వేల మంది ఓటర్ల నుండి సమాచారం సేకరించారు.

BJP government in Delhi with 45 seats, AAP to get 25 seats: Survey

కాగా, ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కొట్టిపారేయలేరని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ప్రచార సంఘం అధ్యక్షుడు అజయ్ మాకెన్ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ 30 సీట్లకు పైగా గెలుస్తుందన్నారు. పలు సర్వేల్లో కాంగ్రెస్ ఏడుకు మించవన్న వాటిని కొట్టి పారేశారు.

ప్రీపోల్ సర్వే: ఏ సర్వే ఏం చెబుతోంది?

ఆజ్ తక్ - సిసిరో సర్వే - బీజేపీ: 19-25 ఏఏపీ: 38-46 కాంగ్రెస్: 0-2
ది వీక్-ఐఎంఆర్బీ సర్వే - బీజేపీ: 36 ఏఏపీ: 29 కాంగ్రెస్: 0-2
ఏబీపీ-నీల్సన్ సర్వే - బీజేపీ: 29 ఏఏపీ: 35 కాంగ్రెస్: 6
జీ-తాలిమ్ సర్వే - బీజేపీ: 32 ఏఏపీ: 34 కాంగ్రెస్: 4
ఇండియా టీవీ - సీ ఓవటరు సర్వే - బీజేపీ: 37 ఏఏపీ: 28 కాంగ్రెస్: 5
హెచ్‌టీ-సీ ఫోర్ సర్వే - బీజేపీ: 27-32 ఏఏపీ: 36-41 కాంగ్రెస్: 2-7
ఐబీఎన్7 - డాటా మినెరల్ సర్వే - బీజేపీ: 36 ఏఏపీ: 27 కాంగ్రెస్: 7
న్యూస్ నేషన్ సర్వే - బీజేపీ: 31-35 ఏఏపీ: 30-34 కాంగ్రెస్: 3-5

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+