వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ జెండా ఎగిరితేనే... సాయుధ పోరాటానికి గుర్తింపు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరినప్పుడే తెలంగాణ సాయుధ పోరాటయోధులకు సరైన గుర్తింపు లభిస్తోందని కేంద్రమంత్రి హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ రజాకార్ల వ్యతిరేకులను,మలిదశ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తూ... తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. సెప్టెంబర్17న ప్రతి గ్రామంలో ప్రజలు స్వచ్చంధంగా ముందుకు వచ్చి తెలంగాణ విమోచన దినాన్ని జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.నిజాం రాజాకార్ల దురాగతాలు నేటికి మర్చిపోలేనివని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ కారు, అయితే ఏం, ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు డ్రైవర్ దూల తీరింది!ప్రభుత్వ కారు, అయితే ఏం, ట్రాఫిక్ పోలీసుల దెబ్బకు డ్రైవర్ దూల తీరింది!

 ఢిల్లిలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

ఢిల్లిలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

ఢిల్లీలో ని కాన్‌స్టిట్యూషనల్ క్లబ్‌ లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను బీజేపీ నేతలు నిర్వహించారు. ఈ సంధర్భంగా బైరాన్‌పల్లి గ్రామ సమరయోధులను ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనిష్ తివారీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళిధర్ రావు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌లు పాల్గోన్నారు. వేడుక వద్ద తెలంగాణ సాయుధ పోరాట దృశ్యాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వార ఏర్పాటు చేశారు.

కేంద్ర హోంశాఖ విమోచన దినోత్సవం నిర్వహిస్తుందని ఆశిస్తున్నా

కేంద్ర హోంశాఖ విమోచన దినోత్సవం నిర్వహిస్తుందని ఆశిస్తున్నా

ఈ సంధర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదని పలువురు ప్రశ్నించారు.విమోచన పోరాటంలో పాల్గోన్న వారి త్యాగాలను విద్యార్థుల పాఠాల్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఇక జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసినట్టుగానే తెలంగాణలో కూడ కేంద్రం స్వయంగా విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ఆశిస్తున్నానని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లాగా టీఆర్‌ఎస్‌ కూడా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. కేసీఆర్‌ అహంకార ధోరణికి అంతం పలికే రోజు ఎంతో దూరంలో లేదని బీజేపీ ఈ వేదిక నుంచి ప్రకటిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఎమ్ఐఎమ్‌కు బయపడే విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు

ఎమ్ఐఎమ్‌కు బయపడే విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు


ఎంఐఎం చేతిలో తెలంగాణ సీఎం కీలుబొమ్మలా సీఎం కేసిఆర్ మారారని కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అందుకే విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని ఆయన మండిపడ్డారు. ఉద్యమ సమయంలో చెప్పిన అంశాలను కేసీఆర్ మరచిపోయారని దుయ్యబట్టారు. ఉద్యమ సమయంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని బీరాలు పలికారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. ఒవైసీ సోదరులను తన భుజాలపై కేసీఆర్ కూర్చొబెట్టుకొని ఊరేగుతున్నారని విమర్శించారు. ఎంఐఎం చేతిలో టీఆర్ఎస్ బందీగా మారిందని దుయ్యబట్టారు.

English summary
BJP leaders held a grand celebration of Telangana Liberation Day at the Constitutional Club in Delhi. Telangana state BJP president Laxman Kishan Reddy,other leaders were participated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X