మోదీ, అమిత్ షా స్కెచ్, కాంగ్రెస్ లో కలవరం, అయోమయంలో సుమలత, సీట్లు డివైడ్ చేసిన ఢిల్లీ!
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి రాజకీయ వ్యూహం రచించేందుకు బీజేపీ, జేడీఎస్‌లు పొత్తు పెట్టుకున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అన్ని లోక్ సభ సీట్లను గెలుచుకోవాలని బీజేపీ, జేడీఎస్‌లు పక్కాప్లాన్ చేస్తున్నాయి. ఢిల్లీలో కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా వ్యూహాలు రచించడంతోపాటు కర్ణాటకలోని లోక్ సభ నియోజక వర్గాల్లో చాలా నియోజకవర్గాలు ఇప్పటికే ఖరరు అయ్యాయి.
కేంద్ర మంత్రి అమిత్ షా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మధ్య పొత్తు కుదిరింది. కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 28 నియోజకవర్గాల్లో బీజేపీకి 24, జేడీఎస్‌కు నాలుగు లోక్ సభ నియోజకవర్గాలు వస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. లోక్ సభ నియోజక వర్గాల కేటాయింపుపై ఇరు పార్టీల మధ్య సాగుతున్న చర్చలు దాదాపు ముగిసిపోయాయని, అధికారిక ప్రకటన మాత్రమే పెండింగ్‌లో ఉందని ఇరు పార్టీలకు చెందినక సీనియర్ నాయకులు చెబుతున్నారు.

జేడీఎస్ నేతలు బీజేపీ హైకమాండ్ నుంచి ఆరు లోక్‌సభ నియోజకవర్గాలను డిమాండ్ చేశారు. కర్ణాటకలోని మండ్య, హాసన్, చిక్కబళ్లాపూరం, కోలార్, తుమకూరు, బెంగళూరు రూరల్ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని జేడీఎస్ పట్టుబట్టింది. అయితే ఆరు నియోజకవర్గాల్లో నాలుగింటిని వదులుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. బీజేపీకి ఏయే నియోజకవర్గాలు, జేడీఎస్‌కు ఏయే నియోజకవర్గాలు అనే పూర్తి సమాచారాన్ని ఢల్లీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు చెప్పారని కన్నడ మీడిమా తెలిపింది.
కర్ణాటకలోని లోక్ సభనియోజక వర్గాలు, బీజేపీ పోటీ చేస్తున్న నియోజక వర్గాలు!
* బెంగళూరు సెంట్రల్
* బెంగళూరు ఉత్తర
* బెంగళూరు దక్షిణ
* బెంగళూరు గ్రామీణ
* తుమకూరు
* మైసూర్
* చామరాజనగర్
* చిక్కమగళూరు
* దావణగెరె
* శివమొగ్గ
* హవేరి
*ఉత్తర కన్నడ
* దక్షిణ కన్నడ
* హుబ్బళి-ధారవాడ
* చిత్రదుర్గ
* బాగల్‌కోటే
*బళ్లారి
* కొప్పాల
* విజయపుర
* కలబుర్గి
* బెళగావి
* బీదర్
* బెల్గాం
* బీదర్
* చిక్కోడి
* రాయచూర్
జేడీఎస్ పార్టీకి కేటాయించిన లోక్ సభ సీట్లు
* మండ్య
* చిక్కబళ్లాపురం
* కోలారు
* హాసన్

పై నాలుగు లోక సభ నియోజక వర్గాలు బీజేపీ హైకమాండ్ జేడీఎస్ పార్టీకి కేటాయించింది. అయితే గత లోక్ సభ ఎన్నికల్లో మండ్య నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించిన ప్రముఖ నటి సుమలతా అంబరీష్ తరవాత బీజేపీకి దగ్గర అయ్యారు. ప్రస్తుతం మండ్య లోక్ సభ నియోజక వర్గం జేడీఎస్ కు కేటాయించడంతో సుమలతా ఎక్కడ నుంచి పోటీ చేస్తారు ?, బీజేపీ హైకమాండ్ సుమలత విషయం ఏం చేస్తుంది ? అనే విషయం అర్థం కాక రెబల్ స్టార్ అంబరీష్ అభిమానులు అయోమయంలో పడిపోయారు.












Click it and Unblock the Notifications