మాజీ ఉపముఖ్యమంత్రికి ఊహించని షాక్, కొడుకుని దూరం పెట్టిన హైకమాండ్, క్లోజ్ !
బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నాయకులు నామినేషన్లు వెయ్యడానికి ఈ రోజు (గురువారం) చివరి రోజు. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు దాదాపుగా అందరూ నామినేషన్లు వేశారు. చివరి రోజు కావడంతో కొన్ని నియోజక వర్గాల్లో నామినేషన్లు వెయ్యడానికి అమావస్యను కూడా లెక్క చెయ్యకుండా నాయకులు పోటీ పడుతున్నారు.
కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, శివమొగ్గ సిటీ నియోజక వర్గం కింగ్ గా పేరు తెచ్చుకుని ఒక్కరికి కూడా చాన్స్ ఇవ్వకుండా వరుసగా ఎమ్మెల్యే అవుతూ వచ్చిన కేఎస్. ఈశ్వరప్పకు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ హైకమాండ్ అవకాశం ఇవ్వలేదు. తనకు అవకాశం ఇవ్వపోయినా తాను మాత్రం బీజేపీలోనే ఉంటానని ఈఎస్. ఈశ్వరప్ప ఇప్పటికే తేల్చి చెప్పారు.

తనకు టిక్కెట్ ఇవ్వలేదని, కనీసం తన కుమారుడు కాంతేష్ కు టిక్కెట్ ఇవ్వాలని కేఎస్. ఈశ్వరప్ప బీజేపీ హైకమాండ్ కు మనవి చేశారు. అయితే బీజేపీ హైకమాండ్ కర్ణాటకలోని దాదాపు అన్ని నియోజక వర్గాలకు అభ్యర్థులను ప్రకటించి శివమొగ్గ, మాన్వి నియోజక వర్గం టిక్కెట్ ఎవ్వరికి ఇవ్వకపోవడంతో ఇన్ని రోజులు టెన్షన్ మొదలైయ్యింది.
చివరికి శివమొగ్గ అసెంబ్లీ నియోజక వర్గం టిక్కెట్ ను కేఎస్. ఈశ్వరప్ప కుటుంబానికి ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చిన బీజేపీ హైకమాండ్ చెన్నబసవప్పకు టిక్కెట్ ఇచ్చేసింది. చివరి నిమిషం వరకు మాన్వి నియోజక వర్గంలో టెన్షన్ పెట్టిన బీజేపీ హైకమాండ్ చివరిక బివి. నాయక్ కు టిక్కెట్ ఇచ్చేసింది. మాన్వి నియోజక వర్గం టిక్కెట్ దక్కకపోవడంతో మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు.

కేఎస్. ఈశ్వరప్పకు రాజకీయ భిక్ష పెట్టి ఇంతకాలం ఆధరించిన శివమొగ్గ అసెంబ్లీ నియోజక వర్గం ఇప్పుడు ఆయన కుటుంబానికి దూరం అయ్యింది. అయితే మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యకపోయినా శికారిపుర నియోజక వర్గం అసెంబ్లీ టిక్కెట్ ఆయన కుమారుడు బీవై, విజయేంద్రకు ఇప్పించుకోవడంలో విజయం సాధించారు.
కర్ణాటక బీజేపీలో ఎంతో సీనియర్ నాయకుడు, యడియూరప్పతో సరిసమానం అయిన నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప మాత్రం ఆయన కుమారుడు కాంతేష్ కు టిక్కెట్ మాత్రం ఇప్పించుకోలేక ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేసి బయటకు వెళ్లలేక వెళ్లలేక సతమతం అవుతున్నారు.రాజకీయంగా బీఎస్, యడియూరప్పకు, కేఎస్, ఈశ్వరప్పకు పోటీ ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications