Karnataka Assembly polls:ముస్లిం రిజర్వేషన్ల తొలగింపుతో బీజేపీ పరిస్థితేంటి..?
బెంగళూరు: మరో కొద్ది రోజుల్లో కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడ రాజకీయ వేడి ఊపందుకుంది. ఇప్పటికే పలు ఒపీనియన్ పోల్స్ సందడి చేయగా తాజాగా ప్రముఖ జాతీయ మీడియా ఎన్డీటీవీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.
కర్నాటకలో ప్రస్తుత అధికార బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు విద్య ఉద్యోగాల్లో ఉన్న 4శాతం రిజర్వేషన్ తొలగించి దాన్ని రాజకీయంగా పలుకుబడి ఉన్న లింగాయత్ వొక్కలిగ సామాజికవర్గాలకు బదిలీ చేయడంతో రాజకీయంగా కమలం పార్టీలో చీలికలు వచ్చాయని ఎన్డీటీవీ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో తేలింది. కొత్తగా లోక్‌నీతి-సీఎస్‌డీఎస్‌తో సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి.

కర్నాటక రాష్ట్రంలో సర్వే చేయగా కేవలం 33శాతం మంది ప్రజలకు మాత్రమే ఈ రిజర్వేషన్ బదిలీ అంశంపై అవగాహన ఉన్నట్లు తేలింది. ఇక ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం పట్ల మద్దతు తెలిపే ప్రజల సంఖ్య 30శాతం మించలేదు.అయితే ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతు ఇస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటూ అవి ఓట్లుగా మారే అవకాశాలున్నాయని పేర్కొంది.
లింగాయత్‌లకు రిజర్వేషన్ ఇవ్వడాన్ని 45శాతం మంది ప్రజలు మద్దతు తెలిపగ,37శాతం మంది ఒక్కలిగ సామాజికవర్గంకు సపోర్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అంశంపై వరుసగా 40శాతం 41శాతం ప్రజలు మద్దతు తెలిపారు. ఇక ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేయడాన్ని 23శాతం మంది సమర్థించగా మరో 25శాతం మంది పాక్షికంగా మద్దతు తెలిపారు.
మార్చి నెలలో కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ముస్లిం సామాజిక వర్గం కర్నాటకలో బీసీ వర్గంగా గత వందేళ్లుగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం లింగాయత్‌లకు 5శాతం నుంచి రిజర్వేషన్ 7శాతంకు చేరుకోగా, ఒక్కలిగ సామాజిక వర్గానికి 6శాతంకు చేరుకుంది. ఎస్సీల రిజర్వేషన్ 15శాతం నుంచి 17శాతంకు చేరుకుంది. ఎస్టీల రిజర్వేషన్ 3శాతం నుంచి 7శాతంకు చేరింది.












Click it and Unblock the Notifications