కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు: సీ ఫోర్ సర్వేను కొట్టిపారేసిన బీజేపీ, జేడీఎస్
Recommended Video

న్యూఢిల్లీ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందంటూ తాజా సర్వే పేర్కొనడం.. రాజకీయంగా కలకలం రేపుతోంది. మొత్తం 224 ఎమ్మెల్యే స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 127 సీట్లు దక్కించుకోనుందని సీ-ఫోర్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.
2013లోనూ కర్ణాటక ఎన్నికలపై ఈ సంస్థ నిర్వహించిన సర్వే.. ఫలితాలను సరిగ్గానే అంచనా వేసింది. అప్పటి ఫలితాలు నిజమైన నేపథ్యంలో తాజా సర్వేపై రాజకీయ నాయకులు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వే కావడంతో ప్రత్యర్థి పార్టీలు దీనిని 'ఫేక్ సర్వే 'గా కొట్టిపారేస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ప్రీ-పోల్ సర్వే ఉత్త బోగస్ అని, మరికొన్ని నెలల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు వాస్తవమేమిటో గట్టిగా తెలుస్తుందని బీజేపీ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎద్దేవా చేశారు. మరోవైపు జేడీఎస్ కూడా ఈ సర్వేను కొట్టిపారేసింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 75 సీట్లకు మించి రావని జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు.
-
బెంగళూరులో ఈవీలు నడిపే వారికి బిగ్ షాక్ -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications