ప్రతిపక్ష నాయకుడు గెలుస్తారని మోదీకి, అమిత్ షాకు షాక్ ఇచ్చిన బీజేపీ లేడీ ఎంపీ !

బెంగళూరు/బెళగావి/హుబ్బళి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదని బీజేపీ మీద తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద పోటీ చేస్తున్న కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ను ఓడించాలని బీజేపీ జాతీయ స్థాయి నాయకులు అందరూ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గంలో జగదీష్ శెట్టర్ ఓటమికి స్వయంగా కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా, ఉత్దరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అందరూ ఆ నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన ఒకేఒక ఏరియా హుబ్బళి,

Karnataka Assembly Elections 2023

హుబ్బళిలో జగదీష్ శెట్టర్ ను గెలిపించుకోవాని స్వయంగా సోనియా గాంధీతో పాటు రాహుల్ గాందీ, ప్రియాంక గాంధీ అక్కడ ఎన్నిక ప్రచారం చేశారు. జగదీష్ శెట్టర్ కు వ్యతిరేకంగా బీజేపీలోని టాప్ సీనియర్ లీడర్స్ అందరూ దాదాపుగా అక్కడ ఎన్నికల ప్రచారం చేశారు. బుధవారం జగదీష్ శెట్టర్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.

జగదీష్ శెట్టర్ ఓటమిని కోరుకుంటున్న బీజేపీ హైకమాండ్ కు అదే పార్టీకి చెందిన లేడీ ఎంపీ మంగళ అంగడి షాక్ ఇచ్చారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కచ్చితంగా విజయం సాధిస్తారని బీజేపీ ఎంపీ మంగళ అంగడి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Karnataka Assembly Elections 2023

బీజేపీ లేడీ ఎంపీ మంగళ అంగడి ఎవరో కాదు, కేంద్ర మాజీ రైల్వే శాఖా మంత్రి దివంగత సురేష్ అంగడి సతీమణి. ప్రస్తుతం మంగళ అంగడి బీజేపీ ఎంపీ. బుధవారం హుబ్బళిలోని విశ్వేశ్వరయ్య నగర్ పోలింగ్ బూత్ లో ఓటు వేసిన బీజేపీ ఎంపీ మంగళ అంగడి మీడియాతో మాట్లాడుతూ కచ్చితంగా జగదీష్ శెట్టర్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెప్పడంతో బీజేపీ నాయకులు బిత్తరపోయారు.

అయితే బెళగావిలో 13 నియోజక వర్గాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, కర్ణాటకలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని బీజేపీ లేడీ ఎంపీ మంగళ అంగడి అన్నారు. జగదీష్ శెట్టర్ ను ఓడించి అక్కడి బీజేపీ అభ్యర్థి మహేష్ టింగినకాయను గెలిపించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నాయకులకు అదే పార్టీకి చెందిన ఎంపీ మంగళ అంగడి షాక్ ఇవ్వడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+