వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరియాణలో హంగ్ అసెంబ్లీ ? సీఎం పదవి ఇస్తారా, చస్తారా ?, జేజేపీ, అమిత్ షా బి ప్లాన్!

|
Google Oneindia TeluguNews

చండీగడ్: హరియాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇంత కాలం అధికారంలో ఉన్న బీజేపీ 2019లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అక్టోబర్ 21 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. అయితే అక్టోబర్ 24వ తేదీ గురువారం జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ పరిశీలిస్తే అంత సులభంగా బీజేపీ అధికారంలో రావడం కష్టం అని తెలుస్తోంది. హరియాణలో కాంగ్రెస్ పార్టీ సైతం 33 నియోజక వర్గాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక జననాయక జనతా పార్టీ (JJP) హరియాణలో కింగ్ మేకర్ అయ్యింది. సీఎం పదవి ఎవరు ఇస్తారో వారికే మా మద్దతు అని జేజేపీ తేల్చి చెప్పింది. హరియాణలో ఎవరు అధికారంలోకి రావాలన్నా జననాయక జనతా పార్టీ మద్దతు అవసరం అని తెలుస్తోంది.

బీజేపీ ఎమ్మెల్యే ప్రేమకథాచిత్రమ్, పెళ్లి పేరుతో శారీరకంగా, ప్రేమకుమారి కేసు ఏందిబీజేపీ ఎమ్మెల్యే ప్రేమకథాచిత్రమ్, పెళ్లి పేరుతో శారీరకంగా, ప్రేమకుమారి కేసు ఏంది

మ్యాజిక్ ఫిగర్ 46

మ్యాజిక్ ఫిగర్ 46

హరియాణలో ఎవరు అధికారంలోకి రావాలన్నా 46 మంది శాసన సభ్యుల మద్దతు అవసరం. గురువారం జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ బీజేపీ 35 స్థానాల్లో, కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, జననాయన జనతా పార్టీ 13 స్థానాల్లో, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అయితే బీజేపీ అధికారంలోకి రావాలంటే ఇతరుల మద్దతు అవసరం అవుతందా ? లేదా ? అనే పూర్తి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి.

ఏం జరుగుతోంది ?

ఏం జరుగుతోంది ?

హరియాణాలో గంట గంటకు ఎన్నికల కౌంటింగ్ వివరాలు టెన్షన్ కు గురి చేస్తున్నాయి. 90 శాసన సభ నియోజక వర్గాల్లో బీజేపీ 35, కాంగ్రెస్ 32 నియోజక వర్గాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయో, మా అవసరం ఎవరికి ఉందో అంటూ జనజనాయక జనతా పార్టీ నాయకులు వేచి చూస్తున్నారు. మొత్తం మీద మా మద్దతు లేకుండా హరియాణలో ఎవ్వరూ అధికారంలోకి రాలేరని జననాయన జనతా పార్టీ నాయకులు అంటున్నారు.

ఎగ్జిట్ పోల్స్ రివర్స్

ఎగ్జిట్ పోల్స్ రివర్స్

2019 శాసన సభ ఎన్నికల ఓటింగ్ పూర్తి అయిన తరువాత అనేక ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. మహారాష్ట్ర, హరియాణలో కచ్చితంగా మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలిపాయి. అయితే గురువారం ఎన్నికల కౌంటింగ్ మొదలు అయిన తరువాత హరియాణలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రివర్స్ అయ్యాయి.

ఓటర్ల మనసులో ఏం ఉంది ?

ఓటర్ల మనసులో ఏం ఉంది ?

హరియాణలో సీట్ల పంపిణి విషయంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఇబ్బందులు ఎదుర్కొనింది. అయితే చివరికి సీట్లు పంపిణి చేసిన కాంగ్రెస్ కు ఆ పార్టీ సొంత నాయకుల అసమ్మతి సెగ తగింది. అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం మా గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పింది. అయితే గురువారం ఓట్ల లెక్కింపు మొదలైన తరువాత ఓటర్ల మనసులో వేరే ఉద్దేశం ఉందని వెలుగు చూస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సైతం తారుమారు అయ్యే అవకాశం ఉంది.

 అమిత్ షా, నడ్డా చర్చలు

అమిత్ షా, నడ్డా చర్చలు

హరియాణలో ఓట్ల లెక్కింపు మొదలైన తరువాత జరుగుతున్న పరిణామాల విషయంలో కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ. నడ్డా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో అత్యవసర సమావేశం అయ్యి చర్చిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో హరియాణలో అధికారం వదులుకోకూడదని, ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని, అందుకు బి ప్లాన్ అమలు చెయ్యాలని అమిత్ షా, జేపీ. నడ్డా చర్చించారని తెలిసింది.

సీఎం పదవి ఇస్తారా ? చస్తారా.. మేమూ చూస్తాం

సీఎం పదవి ఇస్తారా ? చస్తారా.. మేమూ చూస్తాం

హరియాణలో ఎవరు అధికారంలోకి రావాలన్నా మా మద్దతు అవసరం అవుతోందని జననాయక జనతా పార్టీ చీఫ్ దుశ్యంత్ చౌటాల బాంబు పేల్చారు. మాకు ఎవరు సీఎం పదవి ఇచ్చినా సరే వారికే మద్దతు ఇస్తామని గురువారం జేజేపీ పార్టీ అధ్యక్షుడు దుశ్యంత్ చౌటాల తేల్చి చెప్పారు. అయితే హరియాణలో సంపూర్ణ మెజారిటీతో తామే అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

English summary
Haryana assembly elections 2019: BJP lagging behind in Haryana assembly elections. Expected that BJP is going to win by big margin in Haryana but its not happening. JJP may emerge as king maker in Haryana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X