దమ్ముందా: జైట్లీకి కీర్తి ఆజాద్ సవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) అక్రమ వ్యవహారాలపై బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ విరుచుకుపడ్డారు. మీకు దమ్ముంటే నామీద పరువు నష్ట దావా వెయ్యాలని కేంద్ర మంత్రి జైట్లీకి సొంత పార్టీ ఎంపీ సవాలు విసరడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు.
అగ్రనేత, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీద ఓ బీజేపీ ఎంపీ బహిరంగంగా సవాలు విసరడంతో బీజేపీ నాయకులు సీరియస్ అయ్యారు. మీకు దమ్ముంటే నా మీద పరువు నష్టం దావా వేసి నిజాయితీ నిరూపించుకోవాలని కీర్తి ఆజాద్ సూచించారు.

13 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా వ్యవహరించిన జైట్లీ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. ఈ వ్యవహారంలో తన మీద ఆరోపణలు చేసిన కేజ్రీవాల్ ప్రభుత్వం మీద జైట్లీ పరువు నష్టం దావా వేశారు.
ఇప్పటికే జైట్లీ మీద పరోక్షంగా ఆరోపణలు చేస్తూ వచ్చిన జైట్లీ ఇప్పుడు బహిరంగంగా విమర్శలు చేస్తూ సవాలు విసిరిరారు. తన మీద జాలి చూపించాల్సిన అవసరం లేదని, నా మీద కూడా పరువు నష్టం దావా వెయ్యాలని కీర్తి ఆజాద్ ట్విట్ల వర్షం కురిపించారు.












Click it and Unblock the Notifications