ఎవరు వీక్ పీఎం, ఎవరు స్ట్రాంగ్ సీఎం అని జూన్ 4 తేలిపోతుంది, మీకు అంత సీన్ లేదు సార్, చూసుకోండి !
మీ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి కేఎన్ రాజన్న చెప్పినట్లుగా లోక్‌సభ ఎన్నికల్లో 20 సీట్లు గెలవకపోతే సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తారా? అని కర్ణాటకలోని ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ సీఎంను ప్రశ్నించారు. మోదీ వీక్ పీఎం (బలహీన ప్రధాని) అని, తాను స్ట్రాంగ్ సీఎం (బలమైన సీఎం) అంటూ సిద్ధరామయ్య జోకులు వేస్తున్నారని, ఆయనకు తాను ఓ సవాలు విసురుతున్నానని కర్ణాటక ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ సీఎంకు ఓ సవాల్ విసిరారు.
కర్ణాటక రాష్ట్రంలోని 20 లోక్ సభ నియోజక వర్గాల్లో 20 లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిస్తేనే ప్రభుత్వాన్ని నడిపించడం నైతికహక్కు ఉంటుందని, లేదంటే లేదు అంటూ కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ డీసీఎం ఆర్ అశోక్ ఆ మాటలను సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్లారు. మీరు స్ట్రాంగ్ సీఎం లేక వీక్ సీఎం అనే విషయం జూన్ 4వ తేదీన తేలిపోతుందని ఆర్ అశోక్ అన్నారు.

సీఎం సిద్ధరామయ్య ఈ కర్ణాటకలో ఎన్నడూ చూడని అత్యంత బలహీనమైన, నిస్సహాయత కలిగిన ముఖ్యమంత్రి అని ఆరోపించారు. ఇప్పటికే మీ పార్టీ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకుడు బీకే హరి ప్రసాద్ మీపై పలుమార్లు ఆరోపణలు చేసినా కనీసం ఆ వ్యాఖ్యలకు సమాధానం కూడా ఇవ్వకపోవడమే కాకుండా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేని మీ నిస్సహాయత చూస్తుంటే జాలివేస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్ అశోక్ కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు కౌంటర్ ఇచ్చారు.
డీసీఎం డీకే శివకుమార్ వర్గం అవకాశం దొరికినప్పుడల్లా తిరుగుబాటు చేస్తున్నారని, మీ కుర్చీకి గడువు ముగిసిపోయిందని, మీరు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని పదేపదే చెబుతున్నావారి మాటలకు కూడా మీరు కౌంటర్ ఇచ్చే పరిస్థితిలో లేరని సీఎం సిద్దరామయ్యను ఉద్దేశించి బీజేపీ నాయకులు అశోక్ మండిపడ్డారు. వచ్చే ఐదేళ్లపాటు ప్రధాని మోదీయే ఈ దేశానికి బలమైన ప్రధానిగా కొనసాగుతారని విశ్వాసంతో చెప్పే ధైర్యం మాకు ఉందని అశోక్ అన్నారు.

మీకు కూడా అంతే బలం, ధైర్యం ఉంటే, మీరు చెప్పుకుంటున్నట్లుగా మీరు బలమైన ముఖ్యమంత్రి అయితే ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని బహిరంగంగా ప్రజలకు చెప్పండి అంటూ ఆర్ అశోక్ సీఎం సిద్దరామయ్యకు సవాలు విసిరారు. ఐదు సంవత్సరాలు నేనే సీఎం అని మీరు ఖచ్చితంగా చెప్పలేరు, ఈ రాష్ట్రంని ప్రజలు ఎన్నడూ చూడనంత బలహీనమైన ముఖ్యమంత్రి మీరు అనే విషయం గుర్తు పెట్టుకుని మాట్లాడితే మీకే మంచిది అంటూ సీఎం సిద్దరామయ్యకు బీజేపీ నాయకుడు అశోక్ సూచించారు.
మూడు రోజుల క్రితం శివమొగ్గలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కర్ణాటకలో చాలా మంది సీఎంలు ఉన్నారని ఆరోపించారు. మోదీ ఆరోపణలకు సీఎం సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు. డియర్ ప్రధాని నరేంద్ర మోదీ గారు, కాంగ్రెస్ పార్టీలో సూపర్ సీఎంలు, షాడో సీఎంలు ఉన్నారని మీ పార్టీ మీటింగ్ లో చమత్కరించారు, మాకు సూపర్ సీఎం లేరని, షాడో సీఎం లేరని, ఒకే ఒక్క సీఎం ఉన్నారని, అది చాలా స్ట్రాంగ్ సీఎం అంటూ సీఎం సిద్దరామయ్య గట్టిగా చెప్పారు సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలకు ఇప్పుడు బీజేపీ నాయకులు కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications