వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: యూపీలో ఏకే-47 తుపాకులు అద్దెకు ఇస్తారు

|
Google Oneindia TeluguNews

ఘజియాబాద్: బీజేపీ నేత బ్రిజ్ పాల్ తియోతియా హత్య కేసు విచారిస్తున్న పోలీసులు షాక్ కు గురైయ్యే సాక్షాలు సేకరించారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఏకే-47 ఆయుధాలు అద్దెకు ఇస్తున్నారని ఆధారాలు సేకరించారు.

స్థానిక బీజేపీ నాయకుడు బ్రిజ్ పాల్ తియోతియాను ఏకే-47 అత్యాధునిక తుపాకితో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ లో ఏకే-47 ఆయుధాలు అద్దెకు ఇస్తున్నారని గుర్తించారు. రూ. రెండు నుంచి రూ. మూడు లక్షలు డిపాజిట్ చేసుకుని స్థానిక గ్యాంగులకు ఏకే-47 తుపాకీలు అద్దెకు ఇస్తున్నారు.

BJP leader attacked in Ghaziabad in Uttar Pradesh

స్థానిక గ్యాంగులు ఆ దందా చేస్తున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. అద్దెకు తీసుకున్న తుపాకీ తిరిగి ఇచ్చే సమయంలో రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు మినహాయించుకుని మిగిలిన డిపాజిట్ తిరిగిస్తారని వెలుగు చూసింది.

అయితే తుపాకి పోగొడితే ఆ డిపాజిట్ తిరిగి ఇవ్వరు. ఢిల్లీ సరిహద్దులోని ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతాల్లో కొన్ని గ్యాంగులు హత్యలకు సబ్ కాంట్రాక్టులు ఇస్తున్నారు.

అదే విధంగా అత్యాధునిక ఆయుధాలు అద్దెకు ఇస్తున్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. కొందరు ముఠా నాయకులు, కరుడుకట్టిన నేరస్తులు జైల్లో నుంచే ఏకే-47 తుపాకీలు అద్దెకు ఇస్తూ వ్యాపారం చేస్తున్నారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

English summary
DG Law and Order, Daljit Singh Chaudhary, said the police has collected many clues. We are also going through the matters of personal enmity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X