బీహార్లో బీజేపీ నేతను కాల్చి చంపారు, తీవ్ర ఉద్రిక్తత
పాట్నా: బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ నేతను కాల్చి చంపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. మున్గర్ జిల్లా కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా నేత పంకజ్ వర్మను కొందరు దుండగులు కాల్చి చంపేశారు. దీంతో స్థానికులు పోలీసులు వాహనాల పైన రాళ్లు విసిరారు.
సమాచారం మేరకు.. ఆదివారం రాత్రి పంకజ్ తన ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో ఆయన అక్కడికి అక్కడే మృతి చెందారు. దీంతో వందలాది మంది మద్దతుదారులు రహదారులను నిర్బంధించారు.
పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. పోలీసుల వాహనాలను దగ్ధం చేశారు. ఈ హత్యను రాష్ట్ర ప్రభుత్వమే చేయించిందని వారు నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పెద్ద ఎత్తున బలగాలని మోహరించారు. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో ముగ్గురు బీజేపీ నేతలు హత్యకు గురయ్యారు.

మస్కర్ బజారు ప్రాంతంలో ఆయన ఆలయంలో పూజలు చేసి, తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని సబ్ డివిజనల్ అధికారు కుందన్ కుమార్ చెప్పారు. ఈ ఘటనలో పంకజ్ వర్మ అక్కడికక్కడే మృతి చెందారన్నారు.
కాగా, ముంగర్ టౌన్ పాట్నాకు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటోంది. వర్మ హత్య రాజకీయ కోణంలోనే జరిగిందని బీజేపీ, ఆయన మద్దతుదారులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications