Haryana: సోనిపట్‌లో బీజేపీ నాయకుడి దారుణ హత్య
Haryana: హర్యానాలోని సోనిపట్ జిల్లాలో దారుణం జరిగింది. సోనిపట్ జిల్లాలోని గోహానాలోని జవహరా గ్రామంలో బీజేపీ ముద్లానా మండల అధ్యక్షుడిని తుపాకీతో కాల్చి హత్య చేశారు. భూవివాదం కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందం నమూనాలను సేకరించింది.
గోహానాలోని జవహరా గ్రామంలో హోలీ రోజున బీజేపీ ముద్లానా మండల అధ్యక్షుడు సురేంద్ర అనేక బుల్లెట్లతో కాల్చి చంపబడ్డాడు. రాత్రి 9.30 గంటల సమయంలో ఈ హత్య జరిగింది. రాత్రి సురేంద్ర తన వీధిలో నిల్చొని ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన జగదీష్ కుమారుడు మన్ను సురేంద్రపై కాల్పులు జరిపాడు. వీధిలో ఒక బుల్లెట్ తన వైపు దూసుకురావడంతో సురేంద్ర దుకాణంలోకి పరిగెత్తాడు. దుకాణం లోపల మరో రెండు బుల్లెట్లను మన్ను కాల్చాడు. దీంతో అక్కడికక్కడే సురేంద్ర ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం ప్రకారం.. ఆ బీజేపీ నాయకుడు మన్నూ అనే వ్యక్తి అత్త భూమిని కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించి ఒక వివాదం చెలరేగింది. మన్నూ అనే వ్యక్తి బీజేపీ నాయకుడిని ఆ భూమిలో కాలు పెట్టవద్దని హెచ్చరించాడు. చెప్పినా బీజేపీ నాయకుడు పట్టించుకోకుండా ఆ భూమిని సేద్యం చేస్తున్నాడు. ఈ క్రమంలో కోపంతో ఉన్న మన్నూ అతనిపై మూడు సార్లు కాల్పులు జరిపి హత్య చేశాడు.బీజేపీ నాయకుడి హత్య తర్వాత ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు అనేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. నిందితుడు దుకాణంలోకి ప్రవేశించి అక్కడ కాల్పులు జరిపిన సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటపడింది. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు పారిపోయాడు.
#Sonipat भाजपा के मुंडलाना मंडल अध्यक्ष सुरेंद्र जवाहरा की गोली मारकर हत्या गांव जवाहरा में पड़ोसी ने गोली मारकर हत्या की.#CCTV@BJP4Haryana @NayabSainiBJP pic.twitter.com/I9TT9eZpZO
— Anuj Tomar (journalist) (@THAKURANUJTOMAR) March 15, 2025












Click it and Unblock the Notifications