వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్బీఐ గవర్నర్ గారు మీరు చదివిన చదువేంటి..?: బీజేపీ నేత ప్రశ్న

|
Google Oneindia TeluguNews

ఆర్బీఐ గవర్నర్‌గా ఊర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ప్రభుత్వం కేంద్ర ఆర్థిక కార్యదర్శి శక్తికాంత దాస్‌ను నియమించింది. కొత్త ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ పై తన ట్వీట్లతో హోరెత్తించారు గుజరాత్‌కు చెందిన మాజీ మంత్రి జై నారాయణ్ వ్యాస్. ఈయన మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌పై పలు ప్రశ్నల వర్షం కురింపించి బీజేపీ పార్టీని ఇరుకున పెట్టేంత పనిచేశారు జైనారాయణ్ వ్యాస్.

ఊర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్‌గా రాజీనామా చేసిన మూడురోజులకు కొత్త ఆర్బీఐ బాస్‌గా ఈ రోజు బాధ్యతలు చేపట్టారు శక్తికాంత దాస్. ఈ క్రమంలోనే ఐఏఎస్ అధికారి అయిన శక్తికాంత దాస్‌కే కొన్ని ప్రశ్నలు సూటిగా సంధించారు జై నారాయణ్ వ్యాస్. శక్తికాంత దాస్ నేపథ్యం ఏమిటి అతని చరిత్ర ఏమిటని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు జై నారాయణ్ వ్యాస్. శక్తికాంత దాస్‌ చదువు ఎంఏ హిస్టరీ అని చెప్పిన జైనారాయణ్ దాస్... ఆర్బీఐని కూడా ఓ చరిత్ర కిందకు మార్చకుండా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అసలు వ్యాస్ బీజేపీలో ఉన్నారా మరే పార్టీలోనైనా ఉన్నారా అంటూ పలువురు కామెంట్ చేశారు.

BJP Leader Trolls RBI Chief On History Degree, Questions Qualification

అయితే వచ్చిన ట్వీట్లపై వ్యాస్ స్పందించారు. తను కొత్త ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ను అభినందించినట్లు చెప్పారు. తన ట్వీట్ వెనక ఎలాంటి దురుద్దేశం లేదని చెబుతూనే తాను ఇంకా బీజేపీలోనే కొనసాగుతున్నట్లు వివరణ ఇచ్చారు. "ఆర్బీఐని నడపాలంటే దేశీయ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై పట్టుండాలి. ఆర్థిక వ్యవస్థపై విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఐఏఎస్ అధికారులను నేను గౌరవిస్తాను. అయితే అంతకుముందు ఆర్బీఐ గవర్నర్లుగా పనిచేసిన వారికి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై పట్టు ఉన్నింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆర్బీఊ గవర్నర్‌కు ఆ అనుభవం ఉందా" అని ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు వ్యాస్. కొత్తగా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ ఒక ఆర్థికవేత్త అయి ఉంటే బాగుండేదని వ్యాస్ అన్నారు. ఆర్థిక వ్యవస్థను నిర్వహించగలిగేవారు ప్రత్యేకంగా తర్ఫీదు పొంది ఉంటారని వ్యాస్ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పితే సమస్యను ఆర్థిక వేత్తలు మాత్రమే పరిష్కరించగలరని అభిప్రాయపడ్డారు.

English summary
A Gujarat BJP leader has raised questions about new Reserve Bank of India (RBI) governor Shaktikanta Das in a series of baffling tweets. Jay Narayan Vyas, who was minister in Narendra Modi's cabinet in Gujarat, has posted a tweet that is bound to embarrass the ruling party.Jay Narayan Vyas questioned the credentials of Mr Das, an IAS officer, to head the central bank, referring to his history background.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X