తల పట్టుకున్న మాజీ ప్రధాని, మోదీ మాట వింటారా ?, ఫ్యామిలీ సమస్యలతో ఆ సీటు గోవిందా ?
లోక్‌సభ ఎన్నికల ఫీవర్ వేసవి ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంది. కాంగ్రెస్‌ను ఓడించేందుకు కమలదళం నేతలు జేడీఎస్ తో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే బీజేపీ-జేడీఎస్ దోస్తీలో మొదటి నుంచి రెండు పార్టీల నాయకుల మధ్య చీలికకు దారితీసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒకే ఒక్క నియోజకవర్గాన్ని గెలుచుకున్న జేడీఎస్ ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని మూడు లోక్ సభ నియోజకవర్గాలను కోరింది.
అయితే ఈ మూడు నియోజకవర్గాల్లో జేడీఎస్ పై స్థానిక బీజేపీ నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. హాసన్ జేడీఎస్ నేతలకు కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హాసన్ లో జేడీఎస్ ప్రాబల్యాన్ని ఇంకా పెంచేందుకు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే జేడీఎస్ నేతలకు పెద్ద తలనొప్పిగా హాసన్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు తయారైనారు.
జేడీఎస్ తో పొత్తుకు మొదటి నుంచి బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ వ్యతిరేకిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ జేడీఎస్ తో పొత్తును మొదటి నుంచి బహిరంగంగానే వ్యతిరేకించారు. హాసన్ అభ్యర్థిగా ప్రజ్వల్ రేవణ్ణ అని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ ఇప్పటికే ప్రకటించారు. అయితే హాసన్‌లో బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బరిలోకి దింపేందుకు బీజేపీ నేతలు అంగీకరించడం లేదు.

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ప్రతీమ్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఏటీ రామస్వామి, ఎమ్మెల్సీ సిమెంట్ మంజు, బీజేపీ హాసన్ జిల్లా అధ్యక్షుడు సిద్దేశ్ నాగేంద్ర ప్రజ్వల్ రేవణ్ణను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించకూడదని తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రజ్వల్‌పై అనర్హత వేటు కేసు విచారణ సుప్రీంకోర్టులో ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో సుప్రీం కోర్టులో తీర్పు వస్తే బీజేపీ-జేడీఎస్ కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్టే అవుతుందని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముందుజాగ్రత్త చర్యలో భాగంగా ప్రజ్వల్ రేవణ్ణను పక్కనపెట్టి వేరే అభ్యర్థిని హాసన్ లోక్ సభ ఎన్నికల రంగంలోకి దింపాలని సూచించాలని బీజేపీ నేతలు పలు పత్రాలను కేంద్రంలోని బీజేపీ నేతలకు పంపించి వారిని ఒప్పించడానికి ప్రయత్నించారని సమాచారం. బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి ప్రీతమ్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎ.టీ. రామస్వామి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ అమిత్ షా మైసూర్ వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు.

ప్రజ్వలపై కేసు నమోదు చేసిన బీజేపీ నేత, న్యాయవాది దేవరాజ్ గౌడ ద్వారా అమిత్ షా పత్రాలు సమర్పించి కూటమి అభ్యర్థిని మార్చాలని పట్టుబట్టినట్లు సమాచారం. హాసన్ అభ్యర్థిగా ప్రజ్వల్ రేవణ్ణ ఉన్నప్పటికీ గెలిచే అవకాశాలు తక్కువ. జేడీఎస్ లోనే సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ పై వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం. సర్వే సమాచారం సేకరించడానికి వచ్చిన కేంద్ర బీజేపీ బృందం ఎదుట కూడా ప్రజ్వల్ అభ్యర్థి కావడంపై వ్యతిరేకత వ్యక్తమైంది.
స్థానిక నేతల అభిప్రాయం మేరకే హాసన్ ఎంపీ అభ్యర్థిని మార్చాలని బీజేపీ హైకమాండ్ సూచించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రజ్వల్ హాసన్ లోక్‌సభ అభ్యర్థి అని జేడీఎస్ ప్రకటించింది. హాసన్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒకరితో ఒకరు ఉమ్మడిగా సమావేశాలు నిర్వహించలేదని తెలిసింది. జేడీఎస్ నాయకులు మొండిపట్టుతో ప్రజ్వల్ రేవణ్ణను హాసన్ లో బరిలోకి దింపితే అతనికి అనుకూలంగా పని చెయ్యకూడదని బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిర్ణయించారని తెలిసింది
-
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?












Click it and Unblock the Notifications