Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రివర్స్ గేమ్ తో లీడర్స్ కు షాక్, ముళ్లును మళ్లుతోనే తీస్తాము, ఆపరేష్ హస్తంతో షాక్ !

బెంగళూరు/ న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో బీజేపీకి ఆపరేషన్ హస్తం ముప్పు పొంచి ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ఆపరేషన్ హస్తం పేరుతో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను లాక్కోవాలని ప్రయత్నాలు జరుగుతున్న మాటలు నిజం అనే రీతిలో ప్రచారం జరగుతోంది.

ఇదే విషయంలో కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ బహిరంగ ప్రకటన చేశారని చెబుతున్నారు. బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని, బీజేపీ తీరుతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు విసిగిపోయారని కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.

BJP leaders in Karnataka are reeling under the blow of Operation Congress

బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు అని, వచ్చిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని, దీనిపై ఇప్పటికే మా పార్టీ నాయకులు క్లారిటీ ఇచ్చారని, అన్ని విషయాలు త్వరలో చెబుతామని కర్ణాటక హోమ్ మంత్రి పరమేశ్వర్ చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చేవారు కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్మాలని, గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన వారు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు అని హోమ్ మంత్రి డాక్టర్ పరమేశ్వర్ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీని వీడిన వారు మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనే సమాచారం ఉందని, కానీ వారికి ఫస్ట్ బెంచ్ రాలేదు అని. మీరు చేసిన తప్పును సరిదిద్దుకుంటే మళ్లీ రావచ్చు అని హింట్ ఇచ్చామని హోమ్ మంత్రి పరమేశ్వర్ అన్నారు. అంతేకాదు కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు నాతో చర్చించారు. వారి పేర్లు బహిరంగంగా చెప్పలేమని హోమ్ మంత్రి పరమేశ్వర్ అన్నారు.

BJP leaders in Karnataka are reeling under the blow of Operation Congress
ఈసారి కర్ణాటక ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. వారి నమ్మకం మేరకు మా హామీలను నెరవేర్చాం, మేం చెప్పినట్లు నడుచుకుంటున్నామని, అందుకు అనుగుణంగా నడుచుకుంటామని, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలి అని మా పార్టీ నాయకులు అందరూ కష్టపడి పని చేస్తున్నామని కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ అన్నారు.

ఏది పడితే అది చేస్తాం అని మేము చెప్పమని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఒకవైపు, రాజకీయం మరో వైపు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. ఈసారి మేము అధికారంలో ఉన్నామని, మా లక్ష్యం మాకు ఉంటుందని, కానీ ఎవరు విజేత అని ప్రజలు నిర్ణయిస్తారని పరమేశ్వర్ వివరించారు. కాంట్రాక్టర్‌తో బేరసారాలు కుదుర్చుకున్నారని మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి చేసిన ఆరోపణపై పరమేశ్వర్ మండిపడ్డారు

BJP leaders in Karnataka are reeling under the blow of Operation Congress

మాజీ సీఎం కుమారస్వామి ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, వ్యాఖ్యానించే హక్కు ఆయనకు ఉందని, అయితే ఆరోపణ సరైవని కాదు అని సరైన ఆధారాలు లేకుండా మాట్లాడడం సరికాదని, కుమారస్వామి రెండు సార్లు సీఎం అయ్యారు, వాళ్లు మాట్లాడితే జనం గమనిస్తారు. ఆయన చెప్పే దాంట్లో నిజం ఉందని ప్రజలు నమ్ముతారు అని వాళ్లు అనుకుంటున్నారని, అయితే అలాంటి వ్యాఖ్యలు ఆయనకే మంచిదికాదని హోమ్ మంత్రి పరమేశ్వర్ మండిపడ్డారు.

ఇంత అవినీతి ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని కుమారస్వామి చేసిన ప్రకటనపై నేను మాట్లాడను. కానీ, ప్రజలకు మాట ఇచ్చాం. సుపరిపాలన ఇస్తామని చెప్పాము, అందుకు తగ్గట్టుగానే సీఎం సిద్దరామయ్యతో పాటు కర్ణాటక మంత్రులు పనిచేస్తున్నాని, నిందించడం కంటే ఆరోపణలు చేసే ముందు అందుకు తగ్గట్లు ఆధారాలు సేకరించాలని కర్ణాటక హోమ్ మంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర్ ప్రతిపక్ష పార్టీల నాయకులకు సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+