బీజేపీ కొత్త ప్రయోగం: గుజరాత్‌లో మెజీషియన్లతో ప్రచారం

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ మాత్రం కొందరు మెజీషియన్లను రంగంలోకి దించినట్లు సమాచారం.

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే బీజేపీ మాత్రం కొందరు మెజీషియన్లను రంగంలోకి దించినట్లు సమాచారం.

బుధవారం నుంచి పలువురు ప్రొఫెషనల్ మెజీషియన్లు గుజరాత్‌లోని 182 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించేందుకు వీరిని ఉపయోగించుకుంటున్నట్లు తెలిసింది.

BJP Looks to This Army to Create Magic in Gujarat Assembly Election

ప్రజలను మ్యాజిక్ ద్వారా ఆకట్టుకుంటూనే పథకాల గురించి వీరు వివరిస్తున్నట్లు సమాచారం. క్లాసికల్ డ్యాన్స్, 3డీ, హోలోగ్రామ్ టెక్నాలజీని ఉపయోగించి ప్రచారం చేస్తోంది. ప్రజలకు వినోదాన్ని పంచుతూ ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ కొత్త ప్రయోగానికి తెరతీసినట్లు తెలుస్తోంది.

గుజరాత్‌లోని 182నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ఈ మెజీషియన్లు తమ ప్రదర్శనతో జనాలను ఆకట్టుకుంటూ ప్రభుత్వానికి సంబంధించిన పథకాల గురించి వివరిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటోందని బీజేపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ భరత్ సింగ్ సోలంకి ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+