MH Results: మోదీ మేజిక్ - "మహా"యుతికే పట్టం..!!
Maharashtra Results: మహారాష్ట్రలో మహాయుతికే ప్రజలు పట్టం కట్టారు. ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతున్నాయి. మరాఠా ప్రజలు మహాయుతి పార్టీల వైపే మొగ్గు చూపారు. కౌంటింగ్ ప్రారంభం అయిన సమయం నుంచి మహాయుతి కూటమి ఆధిక్యత కొనసాగుతోంది. ఇప్పటికే 150 సీట్లలో ఆధిక్యతతో బీజేపీ కూటమి అధికారం ఖాయం చేసుకుంది. అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్ కూటమి ఆధిక్యత ఉంటుందని భావించిన ప్రాంతాల్లోనూ మహాయుతి సత్తా చాటింది.
మహారాష్ట్రలో మరోసారి బీజేపీ కూటమి అధికారంలోకి రానుంది. మొత్తం 288అసెంబ్లీ స్థానాలు ఉన్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 145 గా ఉంది. కాగా, మహుయుతి కూటమి ఇప్పటికే 190 స్థానాల్లో ఆధిక్యత కొనసాగుతోంది. కాంగ్రెస్ కూటమి 85 స్థానాలతో వెనుకంజలో ఉంది. మహాయుతి కూటమి లో ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తోంది. మరాఠాలో తొలి నుంచి పక్కా వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు వేసింది. సామాజిక సమీకరణాలు - స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. మహా వికాస్ ఘాడీ పార్టీలు అనుకున్న స్థాయిలో పట్టున్న ప్రాంతాల్లోనూ వెనుకంజలో ఉండటం ఆసక్తి కరంగా కనిపిస్తోంది. ఇక, మరో ఏడు చోట్ల ఇతరులు ఆధిక్యతలో ఉన్నారు.

వర్లీ స్థానంలో శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి ఆదిత్య థాకరే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, నాగ పూర్ సౌత్ వెస్ట్‌లో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లీడ్ లో ఉన్నారు. మహయుతి మేజిక్ ఫిగర్ దాటటం తో పాటుగా 200 సీట్లకు దగ్గర అవుతోంది. దీంతో, ఏకపక్షంగా తాము విజయం సాధిస్తామని మహాయుతి నేతలు తొలి నుంచి ధీమా వ్యక్తం చేస్తున్నట్లుగానే ఫలితాల సరళి స్పష్టం అవుతోంది. అటు జార్ఖండ్ లో మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా ఫలితాలు వస్తున్నాయి. మరో గంటలో మహారాష్ట్రలో రెండు కూటముల బలా బలాల పైన అధికారికంగా స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications