అంతా బీజేపీయే చేసింది.. మైనార్టీ ఓటు బ్యాంకు పోయింది: అన్నాడీఎంకే నేత
కేంద్రమంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇప్పటికే కొందరు నేతలు రాజీనామా చేయగా.. మరికొందరు కొన్ని గంటల్లో ప్రమాణం చేస్తారు. అయితే అన్నాడీఎంకే నేత, తమిళనాడు మాజీ మంత్రి షణ్ముగం కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాట తమ పార్టీ ఓడిపోవడానికి బీజేపీతో పొత్తు కారణం అని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత.. ఇవాళ కేంద్రమంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి.
తమ పార్టీకి ఎన్నడూ ఇలా ప్రజా తీర్పు రాలేదని చెప్పారు. ఈ సారి అలా రావడానికి కమలమే కారణమని చెప్పారు. ఎన్నికల్లో మైనార్టీ ఓటుబ్యాంకును తమ పార్టీ కోల్పోయిందని చెప్పారు. ఆయన విల్లుపురం జిల్లా వనూరులో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాజయం పాలయ్యింది. దశాబ్దం తర్వాత డీఎంకే పగ్గాలు చేపట్టింది. అప్పటివరకు విపక్ష స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో 234 అసెంబ్లీ సీట్లు ఉండగా.. డీఎంకే 133 చోట్ల విజయం సాధించింది. బీజేపీతో కలిసి అన్నాడీఎంకే 66 స్థానాలకే పరిమితం అయ్యింది. ఇప్పుడే కాదు గత లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అన్నాడీఎంకే నేత షణ్ముగం కామెంట్లను బీజేపీ నేతలు తోసిపుచ్చారు. ఎన్నికల్లో అపజయానికి కారణం ఇదీ కాదు అని బీజేపీ నేత ఖుష్బు అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications