రాజ్యసభలో తొలిసారి బిజెపి చరిత్ర సృష్టించింది

రాజ్యసభలో అత్యధిక స్థానాలు కలిగిన పార్టీగా బిజెపి నిలిచింది. బిజెపికి 58 మంది ప్రజాప్రతినిధులు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 57 మంది సభ్యులు ఉన్నారు.

న్యూఢిల్లీ: రాజ్యసభలో అత్యధిక స్థానాలు కలిగిన పార్టీగా బిజెపి నిలిచింది. బిజెపికి 58 మంది ప్రజాప్రతినిధులు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 57 మంది సభ్యులు ఉన్నారు.

తద్వారా రాజ్యసభలో బిజెపి తొలిసారి అతిపెద్ద పార్టీగా అవతరించి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు దశాబ్దాల తరబడి ఆధిక్యతను కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ను ఒక్క స్థానంతో వెనక్కి నెట్టి ప్రథమంగా నిలిచింది.

ఇటీవల మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బిజెపికి చెందిన సంపతీయ ఉయికే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. 65 ఏళ్ల పాటు అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ను బిజెపి దాటింది.

BJP makes history, overtakes Congress to become largest party in Rajya Sabha

ఇదిలా ఉండగా, ఎగువసభలో బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం ఇంకా మైనార్టీలోనే ఉంది. 2018 వరకూ కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఈ ఏడాది ఇద్దరు సభ్యుల మృతితో ఆ పార్టీ బలం తగ్గింది.

వచ్చేవారంలో పశ్చిమ బెంగాల్‌లో 6, గుజరాత్‌లో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ బిజెపి ఆధిక్యం చెక్కు చెదిరేలా లేదు.

గుజరాత్‌లో 2 స్థానాలను బిజెపి సునాయాసంగా గెలుచుకునే వీలుండగా, మరో స్థానంలో కూడా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌కు గట్టి పోటీ ఇస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యుల పదవీకాలం ముగుస్తుండగా.. ఈ రెండింటిలో ఒక స్థానమే ఆ పార్టీకి దక్కే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+