సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల సోదరి..ఆమె మతం కూడా అదే..బీజేపీ మంత్రి సంచలన కామెంట్స్
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది టూరిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మతం అడిగి మరి హిందువులపై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు.ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన ఆ 26 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరుకున్నారు. వారి ఆనందపు కేరింతలు కాస్తా ఆర్తనాదాలుగా మారి, ఆ లోయంతా విషాద ఛాయలు అలముకున్నాయి.
పహల్గామ్‌లో జరిగిన భయానక ఉగ్రదాడిలో దాదాపు 26 మంది మరణించారు.దీనికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులపై దాడి చేయడం, ఆ తర్వాత భారత్‌పై పాక్ ఎదురుదాడి చేయడం జరిగింది. పాక్ ఆర్మీకి భారత్ గట్టిగానే బుద్ది చెప్పింది. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు సూచనతో ఇరు దేశాలు కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి.ఉగ్రవాదులు భారత మహిళల నూదట బొట్టు చెరిపివేయడంతో ఆపరేషన్ సిందూర్ పేరిట ఉగ్రవాదుల వేరివేతకు శ్రీకారం చూట్టింది. విచిత్రంగా ఈ ఆపరేషన్ నిర్వహించే బాధ్యతను మహిళా అధికారులకే అప్పగించింది భారత ప్రభుత్వం.

కల్నల్ సోఫియా ఖురేషి ,వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అనే ఇద్దరు మహిళా అధికారులు ఈ ఆపరేషన్ సిందూర్‌ను ముందుండి నడిపారు.వీరిద్దరి పక్కనే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా ఉన్నారు.భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా ముందు వివరాలు వెల్లడించారు. ఈ ముగ్గురిపై భారత ప్రజలు ప్రశంసలు కురించారు. అయితే తాజాగా ఓ బీజేపీ మంత్రి కల్నల్ సోఫియా ఖురేషీ మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ మంత్రి విజయ్ షా ఓ సమావేశంలో మాట్లాడుతూ..ఉగ్రవాదులు మన సోదరీమణులు సిందూరం తుడిచేసి పారిపోయారు. మనం వారిపై ఆపరేషన్ సిందూర్ చేపట్టి వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పామని ఆయన తెలిపారు. ఆయన సందర్భంగా కల్నల్ సోఫియా ఖురేషీ మతం గురించి ప్రస్తావించారు.వాళ్ల మతానికి చెందిన సోదరి కల్నల్ ఖురేషితోనే వాళ్లకు బుద్ది చెప్పించామని వివాదాస్పద కామెంట్స్ చేశారు. మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
नीच, कायर, देशद्रोही‼️
— AamAadmiPartyUPMedia (@MediaCellAAPUP) May 13, 2025
ये बेशर्म आदमी मध्यप्रदेश की BJP सरकार का मंत्री विजय शाह है।
हमारी सेना की बहादुर जांबाज देशभक्त कर्नल को आतंकवादियों की बहन बता रहा है।
हिन्दुस्तान की जिन बेटियों पर हमें नाज़ उनके लिए ये जाहिल भाजपाई मंत्री के ऐसे बोल कतई बर्दाश्त नहीं किया जाएगा। pic.twitter.com/WFHEEBVmk7
సోఫియా మతం గురించి మాట్లాడటం, ఆమె టెర్రరిస్టులకు సోదరి అని సంభోధించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.వెంటనే ఆయనను తన పదవికి రాజకీమా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.మరోవైపు బీజేపీ నాయకులు కూడా మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.












Click it and Unblock the Notifications