మోదీ నాగుపాము అయితే సోనియా గాంధీ విషకన్యనా ?, బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ !
బెంగళూరు/బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాగుపాము లాంటి వ్యక్తి అని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని మోదీ నాగుపాము అయితే మీ నాయకురాలు సోనియా గాంధీ విషకన్యనా ? అంటూ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు, కర్ణాటక ఎంపీ మల్లికార్జున ఖార్గే గురువారం బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాగుపాము లాంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని ముట్టుకోవద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. తరువాత ప్రధాని మోదీని అలా మాట్లాడటం పోరపాటే అని మల్లికార్జున ఖార్గే విచారం వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీని నాగుపాముతో పోల్చడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ పాటు బీజేపీ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల తీరును బీజేపీ నాయకులు విమర్శించారు. అయితే కర్ణాటకలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిత్యం వార్తల్లో ఉంటున్న బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ సోనియా గాంధీ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాగుపాము అయితే మీ నాయకురాలు సోనియా గాంధీ విషకన్యనా అంటూ బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ ఢిల్లీలో ఉంటూ పాకిస్తాన్, చైనాకు ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఆరోపించడం కలకలం రేపింది.
సోనియా గాంధీని విషకన్యతో పోల్చిన బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ పనిలో పనిగా రాహుల్ గాంధీని ఓ పిచ్చోడిగా పోల్చడం హాట్ టాపిక్ అయ్యింది. ఇదే సమయంలో మాజీ సీఎం సిద్దరామయ్య మీద బీజేపీ ఎమ్మెల్యే యత్నాల్ విరుచుకుపడ్డారు. బీజేపీలోని లింగాయత్ నాయకులు అవినీతి పరులు అని సిద్దరామయ్య ఇటీవల ఆరోపించారు.

బీజేపీలోని లింగాయత్ నాయకులను వ్యక్తిగతంగా సిద్దరామయ్య విమర్శిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే లింగాయత్ కులం మొత్తాన్ని సిద్దరామయ్య విమర్శిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు దమ్ము ఉంటే వెంటనే ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా లింగాయత్ కులం నాయకుడి పేరు ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ డిమాండ్ చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే యత్నాల్ సోనియా గాంధీని విషకన్యతో పోల్చడంతో కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ మండిపడుతున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఎన్నిలక ప్రచారంలో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఒకరిమీద ఒకరు చేసుకుంటున్న విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి.












Click it and Unblock the Notifications