బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

PG Girl: సీడీ సుందరికి షాక్, మమ్మీ ఇంటికి నోటీసులు, ఎలాగైనా ఓకే, టైమ్ ఫిక్స్, రాసలీలలు ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ బెళగావి/ విజయపుర: ఒకేఒక్క రాసలీలల సీడితో పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ మంత్రి పదవి ఊడిపోయేలా చేసిన పీజీ సుందరి పుట్టుపూర్వోత్తరాలను పోలీసులు బయటకు తీస్తున్నారు. సీడీ సుందరి కుటుంబ సభ్యుల ఇంటిని (మమ్మీ పుట్టినిల్లు) గుర్తించిన పోలీసులు ఆ ఇంటికి నోటీసులు అంటించారు. మీరు ఎలాగైనా సరే కచ్చితంగా పోలీసుల విచారణ ఎదుర్కోవాలని పోలీసులు ఆ నోటీసుల్లో సీడీ సుందరికి స్పష్టం చేశారు. పవర్ ఫుల్ మంత్రితో రాసలీలలు సాగించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పీజీ సుందరి రాసలీలల సీడీ బయటకు వచ్చిన తరువాత మాయం అయిపోయిన విషయం తెలిసిందే.

Tiktok star: ఆంటీలను చూస్తే సోల్లు కార్చుకున్నారు, సుమా మేడమ్ వన్స్ మోర్, ఓ సారి !Tiktok star: ఆంటీలను చూస్తే సోల్లు కార్చుకున్నారు, సుమా మేడమ్ వన్స్ మోర్, ఓ సారి !

సీడీ సుందరి మాయం

సీడీ సుందరి మాయం

కర్ణాటకలో పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్న బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళితో రాసలీలలు సాగించిన బెంగళూరు పీజీ సుందరి పక్కా స్కెచ్ తో ఆ సీడీని 12 రోజుల క్రితం విడుదల చేయించింది. పీజీ సుందరి సెక్క్ సీడీ దెబ్బతో రమేష్ జారకిహోళి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీడీ విడుదల అయిన తరువాత సీడీ సుందరి ఎవ్వరికి కనపడకుండా రహస్య ప్రాంతంలో తలదాచుకుంది.

మేడమ్ ఇంటికి నోటీసులు

మేడమ్ ఇంటికి నోటీసులు

కర్ణాటకలోని విజయపుర జిల్లా, బసవనబాగేవాడి తాలుకా నిడగుంది పట్టణంలోని వీరేశనగర్ లో సీడీ సుందరి తల్లి పుట్టినిల్లు ఉంది. రమేష్ జారకిహోళితో రాసలీలలు సాగించిన యువతి కోసం పోలీసులు గాలించినా ఎలాంటి ఫలితం లేదు. సీడీ సుందరి తల్లి పుట్టినిల్లు నిడగుందిలోని వీరేశనగర్ లో ఉందని తెలుసుకున్న బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీసులు ఆ ఇంటికి చేరుకుని ఇంటి తలుపుకు నోటీసులు అతికించారు. సీడీ సుందరి ఇదే ఇంటిలో నివాసం ఉంటున్న విజయపురలో విద్యాభ్యాసం చేసిందని పోలీసులు గుర్తించారు.

తాళం వేసి సైలెంట్ గా చెక్కేశారు

తాళం వేసి సైలెంట్ గా చెక్కేశారు

పీజీ సుందరి రాసలీలల సీడీ విడుదల అయిన రోజు రాత్రి సీడీ సుందరి కుటుంబ సభ్యులు ఆ ఇంటికి తాళం వేసి వెళ్లి మాయం అయ్యారని పోలీసులు అంటున్నారు. నోటీసులు తీసుకోవడానికి ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఇంటికి నోటీసులు అతికించామని బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులు అంటున్నారు.

 చూడమ్మ సుందరి...... ఎలాగైనా మాకు ఓకే

చూడమ్మ సుందరి...... ఎలాగైనా మాకు ఓకే

సీడీ సుందరి ఇంటికి అతికించిన నోటీసుల్లో కబ్బన్ పార్క్ పోలీసులు విచారణకు హాజరుకావాలని వివరించారు. మాజీ మంత్రి రమేష్ జారకిహోళితో రాసలీలలు సాగించారని మీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులను మీరు నేరుగా కాని, మొబైల్ ఫోన్లో కాని, ఈ మెయిల్ ద్వారా కాని మీరు సంప్రధించాలి. మేము సూచించిన గడువులోపు కచ్చితంగా విచారణకు హాజరై పోలీసు అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఇంటికి అంటించిన నోటీసుల్లో వివరించారు.

కేసు పెట్టిన పొలిటికల్ లీడర్

కేసు పెట్టిన పొలిటికల్ లీడర్

రాసలీలల సీడీ వీడుదలైన 12 రోజుల తరువాత మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో యువతి మీద, మరి కొందరి మీద కేసు పెట్టడం కలకలం రేపింది. తనను రాజకీయంగా అంతం చెయ్యడానికి, తన కుటుంబం పరువు బజారున పడటానికి కొందరు కుట్రపన్నారని మాజీ మంత్రి రమేష్ జారికిహోళి కేసు పెట్టారు.

నకిలీ సెక్స్ సీడీ ?

నకిలీ సెక్స్ సీడీ ?

తన మీద లేనిపోని నిందలు వేసి నకిలీ రాసలీలల సీడీలు తెరమీదకు తెచ్చిన వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి రమేష్ జారకిహోళి కేసు పెట్టడంతో కథ రసవత్తరంగామారింది. రమేష్ జారకిహోళి కేసు పెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు యువతి అమ్మమ్మ ఇంటికి నోటీసులు అతికించడంతో రాసలీలల సీడీ వ్యవహారం మరో మలుపు తిరిగింది.

English summary
BJP MLA Ramesh Jarkiholi and PG Girl CD Row: Bengaluru Cubbon Park Police given notice to victim women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X