కలకలం: బీజేపీ ఎమ్మెల్యే ఇంటిపై కాల్పులు, గ్రనేడ్ విసిరారు

మీరట్: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ ఇంటిపై కొందరు దుండగులు కాల్పులు జరపడంతోపాటు గ్రైనేడ్ విసిరి పారిపోయారు. సర్ధానా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గురువారం ఉదయం ఒంటిగంట సమయంలో సంగీత్ సోమ్ ఆయన ఇంటికి వచ్చారు. సంగీత్ సోమ్ ఇంట్లోకి వెళ్లిన కొద్ది సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు స్విఫ్ట్ కారులో వచ్చారు. ఆ వెంటనే ఎమ్మెల్యే ఇంటిపై కాల్పులు జరిపారు.

BJP MLA Sangeet Som escapes attack; assailants open fire, hurl grenade at his house in Meerut

దుండగులు కారులో గేటు ముందు నుంచి ఎమ్మెల్యే ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడున్న భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కారులో నుంచి దిగిన ఓ వ్యక్తి ఎమ్మెల్యే ఇంటిపై గ్రైనేడ్ విసిరి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఎమ్మెల్యే ఇంటి వద్ద మందుగుండ్లు స్వాధీనం చేసుకున్నామని, ఎమ్మెల్యేపై దాడి ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఎస్‌పీ అఖిలేష్ కుమార్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+