మేలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు: మోదీ విజయ లక్ష్యం 150 సీట్లు?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతోపాటు ఉత్తరాఖండ్ లోనూ ఘన విజయం సాధించిన బీజేపీ... అదే ఊపులో గుజరాత్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించినట్లు తెలుస్తున్

న్యూఢిల్లీ/ గాంధీనగర్ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతోపాటు ఉత్తరాఖండ్ లోనూ ఘన విజయం సాధించిన బీజేపీ... అదే ఊపులో గుజరాత్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించినట్లు తెలుస్తున్నది.

రెండు రోజుల క్రితం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత వివిధ మీడియా సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొనడం.. అంతకు మించి మెరుగైన ఫలితాలు రావడంతో బీజేపీలో ఉత్సాహం ఉరకలేస్తున్నట్లు కనిపిస్తున్నది.

యూపీలో ఎన్నికల ప్రచారం ముగించుకుని సొంత రాష్ట్రం గుజరాత్ కు చేరుకున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. తన నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారని తెలియవచ్చింది. ప్రధాని మోదీకి గల హవాకు అనుగుణంగా ముందస్తు ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం కావాలని అమిత్ షా ఆదేశించినట్లు సమాచారం.

అమిత్ షా భేటీకి ఆనందీబెన్ పటేల్ డుమ్మా

అమిత్ షా భేటీకి ఆనందీబెన్ పటేల్ డుమ్మా

గాంధీ నగర్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్, తదితరులతో లోతుగా, విస్త్రుత స్థాయిలో అమిత్ షా సమాలోచనలు జరిపారని తెలుస్తున్నది. ఈ సమావేశానికి మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ గైర్హాజరు కావడం అనుమానాలకు తావిస్తున్నది. ఏ క్షణాన్నైనా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సమాయాత్తం కావాలని అమిత్ షా ఆదేశించారు. ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనకు ముందే సొంత రాష్ట్రానికి చేరుకున్న అమిత్ షా పార్టీ సీనియర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమయ్యారు. తొలుత తన ఇంట్లో తర్వాత పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశాల్లో సీఎం విజయ్ రూపానీతోపాటు మంత్రులు భూపేంద్ర సిన్హ్ చుదాస్మా, ప్రదీప్ సిన్హ్ జడేజా, శంకర్ చౌదరీ, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జితు వాఘానీ, సంస్థాగత కార్యదర్శి వీ సతీశ్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వివరాలు మాత్రమే పంచుకున్నామని జితు వాఘానీ వ్యాఖ్యానించడం గమనార్హం.

మే లోగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు

మే లోగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు

ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపై చర్చ జరిగినట్లు బహిరంగంగా ఎవరూ చెప్పకున్నా.. అంతర్గతంగా పార్టీ నిర్వహించిన సర్వే ప్రకారం ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే సబబని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. యూపీలో విజయం తమకు బూస్ట్ గా పరిణమిస్తుందని గుజరాత్ నేతలు అనుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పాఠశాల, కళాశాల విద్యార్థుల పరీక్షలు ముగిసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు రంగం సిద్ధమవుతుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. మే నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయాలని బీజేపీ నాయకత్వం కోరుకుంటుందని ఆ పార్టీ మరో నేత అన్నారు.

ఇక అమిత్ షాకు పూర్తి స్వేచ్చ

ఇక అమిత్ షాకు పూర్తి స్వేచ్చ

పార్టీ పరంగా, ఎమ్మెల్యేల్లో, ఎంపీల్లో గ్రూపు తగాదాలు ఉన్నా. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు అనుగుణంగా టిక్కెట్ల ఖరారు, నేతలకు ప్రాధాన్యం, ఎన్నికల ప్రచార వ్యూహం ఖరారు విషయాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షాకు స్వేచ్ఛ లభించినట్లేనని భావిస్తున్నారు. అన్ని గ్రూపులకు సమానంగా టిక్కెట్లు పంపిణీ చేస్తే పార్టీ విజయావకాశాలు మెరుగైనట్లేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భారత్ పాండ్య చెప్పారు.

సమస్యల పరిష్కారంపై ద్రుష్టి పెట్టాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు హితవు

సమస్యల పరిష్కారంపై ద్రుష్టి పెట్టాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు హితవు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 150 సీట్లలో విజయం సాధించాలని బీజేపీ శ్రేణులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిశా నిర్దేశం చేశారని తెలుస్తున్నది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ గౌరవార్థం సీఎం విజయ్ రూపానీ ఇచ్చిన విందుకు హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలతో వేర్వేరుగా, గ్రూపుల వారీగా, జిల్లాల వారీగా సమావేశమయ్యారని పార్టీ వర్గాల కథనం. ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన హితవు చెప్పారని సమాచారం. నియోజకవర్గాల వారీగా అభివ్రుద్ధి పనుల పూర్తిపై కేంద్రీకరించాలని స్పష్టం చేశారని వినికిడి.

విజయ్ రూపానీ విందులో ఇలా..

విజయ్ రూపానీ విందులో ఇలా..

ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించినట తర్వాత తొలిసారి సొంత రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు. గ్రూపుల వారీగా వారితో జరిగిన చర్చల్లో ఎన్నికల్లో కీలక అంశాలపై లోతుగా చర్చించారని, వాటికి పరిష్కార మార్గాలు కూడా సూచించారని సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల ప్రగతిపైనా ఆయన ఆరా తీశారని తెలుస్తున్నది. కానీ విందు సమావేశంలో ఎటువంటి ఎన్నికల గురించి చర్చ జరుగలేదని బీజేపీ గుజరాత్ శాఖ అధికార ప్రతినిధి భరత్ పాండ్యా చెప్పారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను గ్రీట్ చేయడానికే ప్రధాని పరిమితం అయ్యారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+