ఇరు వర్గాల ఘర్షణల్లో తలపగిలిన బీజేపీ ఎంపీ
బెంగాల్ రాజకీయ ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన దాడుల్లో బెంగాల్ బీజేపీ ఎంపీకి తలకు గాయాలయ్యాయి. గతంలో టీఎంసీ ఉండి ఇటివల బీజేపీలో చేరి ఎంపీగా ఎన్నికైన అర్జున్ సింగ్ ఘర్షణల్లో గాయపడ్డాడు. పార్టీ కార్యాలయం కోసం జరిగిన జరిగిన రెండు వర్గాల మధ్య జరిగిన దాడిలో గాయపడిన ఎంపీకి తల పగలడంతో కుట్లు వేశారు.

బెంగాల్‌లో ఇరు పార్టీల మధ్య ముదిరిన ఘర్షణలు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నుండి అటు తృణముల్ కాంగ్రెస్ ఇటు బీజేపీ కార్యకర్తలు, నేతల మధ్య ప్రారంభమైన ఘర్షణలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికల తర్వాత బెంగాల్‌లో గతంలో ఎప్పుడు లేనట్టుగా 17 స్థానాలను బీజేపీ సాధించింది. దీంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ నేతలు ఉప్పు నిప్పులా ఉంటున్న విషయం తెలిసిందే...ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగుతున్నాయి. దీంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నిత్యం చేటుచేసుకుంటున్నాయి.

బార్రాక్‌పోర్ నేడు మరోసారి ఘర్షణ
ఈ నేపథ్యంలోనే నేడు 24 పరగణా జిల్లాలోని బార్రాక్‌పోర్ ప్రాంతంలో మరో ఘర్షన చెలరేగింది. ఈ ఘర్షణల్లో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ తలకు గాయాలయ్యాయి. గతంలో టీఎంసీ నేతగా ఉన్న అర్జున్ సింగ్ బార్రాక్ పోర్ బీజేపీ ఎంపీగా గెలిచారు. దీంతో బర్రాక్‌పోర్ లోని పార్టీ కార్యాలయాన్ని స్వాధినం చేసుకునేందుకు టీఎంసీ కార్యకర్తలు వచ్చారనే సమాచారంతో బీజేపీ కార్యకర్తలు వెళ్లారు. దీంతో ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదం మొదలై ఘర్షణకు దారితీసింది. ఇక విషయం తెలుసుకున్న ఎంపీ తాను అక్కడికి వెళ్లినట్టు తెలిపాడు. ఇరువర్గాలను
అర్జున్ సింగ్ తలకు కుట్లు
ఈనేపథ్యంలోనే తన కారుపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారని ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపించారు. మరోవైపు తనపై దాడి చేశారని తెలిపారు. టీఎంసీ కార్యకర్తలకు తోడు స్థానిక పోలీసు కమీషనర్ మనోజ్ వర్మ తనపై లాఠీ చార్జ్ చేసి తలపై బాదాడని ఎంపీ ఆరోపించాడు. ఇక ఇరువర్గాల దాడుల్లో ఎంపీ అర్జున్ సింగ్ తలకు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తలకు గాయాలు కావడంతో కట్లు పడ్డాయి.












Click it and Unblock the Notifications