బాంబు బ్లాస్ట్ లో రాహుల్ గాంధీ చనిపోయారని బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు, ఏం జరిగింది ?
ఓ గొప్ప సన్యాసి ఇందిరా గాంధీని శపించాడని, అదేవిధంగా ఆ శాపాల కారణంగా బాంబు పేలుడులో రాహుల్ గాంధీ కూడా చనిపోయారని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీఎం అనంత్ కుమార్ హెగ్డే ఎందుకు ఇలా మాట్లాడారు అని అందరూ షాక్ అయ్యారు. కర్ణాటకలోని కుమటా ప్రాంతంలో బీజేపీ, హిందూ కార్యకర్తల సమావేశంలో బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే ఇలా మాట్లాడారు.
అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో గోహత్య నిషేధంపై పెద్దఎత్తున ఆందోళన జరిగిందని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అన్నారు. ఈ ఉద్యమంలో డజన్ల కొద్దీ సాధువులు చనిపోయారు. ఇందిరా గాంధీ సమక్షంలోనే ఈహత్యలు జరిగాయని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే ఆరోపించారు. ఇదే సమయంలో వందలాది ఆవులను కూడా కాల్చి చంపారని అనంత్ కుమార్ హెగ్డే తెలిపారు.

అందుకే గోఅష్టమి రోజునే నీ వంశం నాశనమవుతుందని ఇందిరాగాంధీని మహా తపస్వి కరపత్రి మహారాజు అనే సన్యాసి శపించాడని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అన్నారు ఆసాధువు శాపం ప్రకారమే గోఅష్టమి నాడు ఒకరు మరణించారు. గోఅష్టమి రోజున జరిగిన విమాన ప్రమాదంలో ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ మరణించారని, తరువాత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కాల్చి చంపారని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే అన్నారు.
ఆత్మాహుతి దాడులు జరగడంతో బాంబు పేలుడులో రాజీవ్ గాంధీ బదులుగా రాహుల్ గాంధీ మరణించారని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చెప్పారు. వెంటనే షాక్ కు గురైన బీజేపీ కార్యకర్తలు రాహుల్ గాంధీ కాదు అన్నా రాజీవ్ గాంధీ అని అనడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ చనిపోయారని అన్నారు. ఇదే సమావేశంలో బాబ్రీ మసీదు ధ్వంసం చేసినట్లే భత్కల్‌లోని ఓ చిన్నద గ్రామం ( బంగారు గ్రామం) కూడా దాని సరసన చేరనుందని బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలోని శ్రీరంగపట్నంలో అతిపెద్ద మసీదు ఒక మారుతీ దేవాలయం అని, శిరిసిలోని సీపీ బజారులో ఉన్న మసీదు గతంలో విజయ విఠల దేవస్థానం అని, దేశంలోని ప్రతి గ్రామంలోని ప్రతి సందులోను అపవిత్రమైన అనేక చిహ్నాలు ఉన్నాయని, వాటిని తొలగించే వరకు ఈ హిందూ సమాజం ఊరుకోదని, రణభైరవ లేచిన తరువాత వెనక్కి తగ్గేదిలేదని, వెయ్యి ఏళ్ల పగ తీర్చుకోకపోతే మాది హిందువుల రక్తం కాదని హిందూ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడిన బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications