చంద్రబాబు పేరు ప్రస్తావన.. రాజ్యసభ లాస్ట్ స్పీచ్‌లో సుజనా చౌదరి
ఎగువసభ రాజ్యసభలో కొందరు సభ్యుల పదవీ కాలం ముగిసింది. ఇంకేముంది వారు తమ చివరి ప్రసంగం చదివారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అలా మాట్లాడిన సంగతి తెలిసిందే. తర్వాత బీజేపీ ఎంపీ వై సుజనా చౌదరి వంతు వచ్చింది. ఆయన కాసింత ఉద్వేగానికి గురయ్యారు. అంతేకాదు చంద్రబాబు నాయుడును గుర్తుచేసుకున్నారు. ఆయన వల్లే తనకు పదవీ అని చెప్పారు.
రాజ్యసభలో బీజేపీ ఎంపీ వై సుజనా చౌదరి తన వీడ్కోలు సందేశాన్ని వినిపించారు. వరుసగా రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికైన సుజనా చౌదరి సెంకడ్ టెర్మ్ పదవీ కాలం త్వరలో ముగియనుంది. రాజ్యసభలో ఆయన తన వీడ్కోలు సందేశాన్ని వినిపించారు. విద్య రీత్యా ఇంజినీర్ అయిన తాను వృత్తి రీత్యా ఔత్సాహిక పారిశ్రామికవేత్తనని తెలిపారు.

రాజకీయ ప్రస్థానం మొదలై 12 ఏళ్లు అవుతోందని అన్నారు. తన రాజకీయ ప్రస్థానంతోపాటు రాజ్యసభలో తన ప్రస్థానం కూడా 12 ఏళ్లేనని చెప్పారు. తనను తొలిసారిగా రాజ్యసభకు పంపిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండు పర్యాయాలు కూడా చంద్రబాబే తనను రాజ్యసభకు పంపిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం టీడీపీతో పాటు చంద్రబాబుతోనూ రాజకీయంగా విభేదించానని తెలిపారు. ఓ విజనరీగా చంద్రబాబుపై తనకు అపారమైన గౌరవం ఉందని సుజనా చెప్పారు. ఇక సభలో తనకు మార్గదర్శకులుగా నిలిచిన పలువురి పేర్లను సుజనా చౌదరి ప్రస్తావించారు. ప్రధాని మోడీకి, బీజేపీ నాయకత్వానికి, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభతో పాటు పార్లమెంటు సిబ్బందికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications