ఇస్కాన్ సంస్థపై సంచలన ఆరోపణలు చేసిన బిజెపి ఎంపీ..
బిజెపి ఎంపీ మేనకగాంధీ ఇస్కాన్ సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ సంస్థ గోశాలలు నిర్వహిస్తున్న పేరుతో ఆవులను కసాయిలకు విక్రయిస్తోందని, భారతదేశంలోనే అతిపెద్ద మోసపూరిత సంస్థ ఇస్కాన్ అని మేనకగాంధీ ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ మేనకగాంధీ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ చైతన్యం (ఇస్కాన్) సంస్థపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇస్కాన్ వాళ్లు దేశంలోనే దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారని, వారు చేసినట్టుగా మరెవరూ చేయలేరని, గోశాలల నిర్వహణ పేరిట ఆవులని కసాయి వాళ్లకి అమ్మేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారామె. అయితే దీనిపై ఇస్కాన్ స్పందించింది.
దేశంలోని అతిపెద్ద మోసపూరిత సంస్థ..
ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో 'ఇస్కాన్ దేశంలోనే అతిపెద్ద మోసపూరితమైన సంస్థ. అది గోశాలలను నిర్వహిస్తోంది. దీని వల్ల విస్తారమైన భూములతో సహా ప్రభుత్వం నుండి ప్రయోజనాలను పొందుతోంది'' అని ఆమె పేర్కొన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం గోశాలను సందర్శించానని మేనకా గాంధీ ఆ వీడియోలో తెలిపారు. అయితే అక్కడ ఒక్క ఆవు కూడా లేదని, దూడ కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నింటిని కసాయి వాళ్లకు అమ్మేసారని ఆవేదన వ్యక్తపరిచారు. ఇలాంటి పనులు చేస్తూ మళ్లీ రోడ్లపైకి హారేరామా హరే కృష్ణ అంటూ పాటలు పాడుతుంటారు. తమ జీవితమంతా పాలపైనే ఆధారపడి ఉందని చెప్పకుంటూ వాళ్లు చేసే పని ఇదంటూ ధ్వజమెత్తారు. బహుశా కసాయిలకు వీళ్లు అమ్మినన్ని పశువులను బహుశా ఎవరూ అమ్మి ఉండరు. ఇలా వారు చేసినట్టుగా మరెవరూ చేయరు.'' అని మేనకా గాంధీ ఆరోపించారు.

స్పందించిన ఇస్కాన్..
మేనకా గాంధీ ఆరోపణలపై స్పందించిన ఇస్కాన్.. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో గోసంరక్షణలో తమ సంస్థ అగ్రగామిగా ఉందని చెప్పుకోచ్చారు. మేనకా గాంధీ ఆరోపణలన్నీ నిరాధారమైనవని తెలుపుతూ ఆ సంస్థ భారతదేశ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆవు, ఎద్దుల సంరక్షణలో ఇస్కాన్ ముందంజలో ఉందని పేర్కొన్నారు. భారతదేశంలో ఇస్కాన్ 60కి పైగా గోశాలలను నడుపుతుందని, వందలాది పవిత్రమైన ఆవులు, ఎద్దులను సంరక్షిస్తూ, వాటి జీవితకాలమంతా వ్యక్తిగత సంరక్షణను అందిస్తోంది. తమ సంస్థ ఆవులు, ఎద్దులను కసాయిదారులకు విక్రయించకుండా జీవితాంతం సేవ చేస్తోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇస్కాన్ గోశాలల్లో వదిలివేయబడిన ఆవులు, గాయపడిన, వధించకుండా కాపాడిన ఆవులను మా వద్దకు తీసుకొచ్చి, వాటికి సేవలు అందిస్తున్నాం'' అని ఆయన పేర్కొన్నారు.

హరే కృష్ణ ఉద్యమంలో అనుబంధమైన ఇస్కాన్‌కు ప్రపంచవ్యాప్తంగా వందలాది దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు ఉన్నారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసలపై కొన్ని నెలల కిందట విమర్శలు చేసి ఇస్కాన్ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications