సొంత ఎంపీలకు 70 ప్రశ్నలతో పరీక్ష, మోడీకి షాకిచ్చారు!

ఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దాదాపు 70 మంది ఎమ్మెల్యేల తీరుతో ప్రధాని నరేంద్ర మోడీ అవాక్కయ్యారు! గత సార్వత్రిక ఎన్నికలలో యూపీ నుంచి 73 మంది బిజెపి ఎంపీలు గెలిచారు. ఇందులో డెబ్బై మంది వరకు సొంత ప్రభుత్వం పథకాల గురించి తెలియదట.

ఆ ఎంపీలకు కేంద్రం ప్రవేశ పెట్టిన పథకాలు, ఆ పథకాలు ఇప్పటి వరకు సాధించిన విజయాల గురించి తెలియదట. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు గురించి గానీ, ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారన్న అంశం గానీ తెలియదు. చివరికి తమ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారో కూడా తెలియకపోవడం గమనార్హం.

BJP MPs from Uttar Pradesh fail Modi's governance quiz

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూపీ ఎంపీలకు ప్రభుత్వ పథకాల మీద ఎంత అవగాహన ఉందో తెలుసుకునేందుకు ప్రధాని మోడీ సాక్షాత్తూ వారికి చిన్న పాటి పరీక్ష పెట్టారు. వారిని ప్రధాని మోడీ 70 ప్రశ్నల దాకా అడిగారు.

అయితే, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం తెలియక తెల్లమొహం వేశారు. దీనదయాళ్ జ్యోతిగ్రామా స్కీం కింద నియోజకవర్గాల్లో ఎన్ని గ్రామాలకు కరెంట్ వచ్చిందని అడగగా.. ఎవరూ చేయి ఎత్తలేదు. ప్రభుత్వం సాధించిన విజయాల గురించి తెలిపే మొబైల్ యాప్‌ను ఎంతమంది డౌన్ లోడ్ చేసుకున్నారంటే సమాధానం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+